More

    5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ

    భారతదేశంలో 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సేవలను ప్రధాని మోదీ లాంచ్ చేశారు. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందిస్తున్నారు. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు.

    ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ – 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్‌ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మోదీకి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోదీ స్వయంగా పరిశీలించారు. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. అక్టోబరులోనే 5జీ సేవలు తీసుకొస్తామని ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ప్రకటించాయి. 4 జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నంచి ప్రసారం అవుతాయి. 5జీలో స్మాల్ సెల్ టెక్నాలజీ వాడుతారు. చిన్న బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ తో హై బ్యాండ్ సేవలు అందుతాయి.

    Trending Stories

    Related Stories