వచ్చే నెల 20 నుండి 28 వరకు గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. రెండు తెలుగు సినిమాల ప్రదర్శన కోసం ఆర్.ఆర్.ఆర్, అఖండ లకు గుర్తింపు లభించింది. ఫిలిం ఫెస్టివల్ తేదీలు, ప్రదర్శించే సినిమాల వివరాలు ఇండియన్ పనోరమా ప్రకటించింది. ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్ లో ఒకటిగా ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు విశేష ప్రాచుర్యం చోటుచేసుకుంది. ఈ సారి 25 ఫీచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ప్రదర్శన జరగనుంది. మెయిన్ స్టీమ్ సినిమా సెక్షన్ లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్, అఖండ రెండు తెలుగు సినిమాలకు చోటు లభించడం గమనార్హం. ఆర్.ఆర్.ఆర్, అఖండలతో పాటు మెయిన్ స్టీమ్ సినిమా సెక్షన్ లో కాశ్మీర్ ఫైల్స్ (హిందీ), టోనిక్ ( బెంగాలీ) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) ప్రదర్శన జరగనుంది. ఫీచర్స్ ఫిలిమ్స్ విభాగంలో సినిమా బండి, కుదిరం బోసే తో ప్రదర్శనకు స్థానం సంపాదించాయి.