బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 52 మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించగానే చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
మంటలతో చిక్కుకున్న వారిలో ఇప్పటి దాకా చనిపోయిన వారి లెక్క 52 అని అధికారులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న కార్మికుల బంధువులు, ఇతర కార్మికులు ఫ్యాక్టరీ బయట ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరు ప్రాణాలతో మిగిలి ఉన్నారో.. ఎవరు ప్రాణాలు కోల్పోయారో తెలియని పరిస్థితి నెలకొంది. పారిశ్రామిక సముదాయాల వద్ద వరుస విపత్తులు జరుగుతున్నా కూడా బంగ్లాదేశ్ అధికారుల్లో మార్పు రావడం లేదని చెబుతూ ఉన్నారు. 2013 లో రానా ప్లాజా విపత్తు నుండి తొమ్మిది అంతస్తుల సముదాయం కూలి 1,100 మందికి పైగా మరణించిన తరువాత కూడా అధికారుల్లో చలనం కనిపించలేదని.. సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 2019 లో చట్టవిరుద్ధంగా రసాయనాలను నిల్వ చేసిన అపార్టుమెంటులో ప్రమాదం కారణంగా కనీసం 70 మంది మరణించారు.
గురువారం మధ్యాహ్నం ఢాకా వెలుపల ఉన్న పారిశ్రామిక పట్టణమైన రుప్‌గంజ్‌లోని హాషేమ్ ఫుడ్ అండ్ పానీయం కర్మాగారంలో తాజా అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 24 గంటల తరువాత కూడా మంటలు ఉధృతంగానే ఉన్నాయి.