ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో 500 ఆవులు కొట్టుకుపోయాయి. ఒక ఆవు చనిపోయినట్లు చెబుతున్నారు. మిగిలిన వాటిని జాలర్లు, గజ ఈతగాళ్లు రక్షించారు. వెలుగోడు సమీపంలో మేతకు వెళ్లిన 500 ఆవులను సమీప అడవిపందులు వెంటపడి తరిమాయి. దీంతో ఆవులన్ని వెలుగోడు రిజర్వాయర్ లోకి దిగాయి. నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోతుండగా గమనించిన గ్రామస్థులు, జాలర్లు 350 ఆవులను రక్షించారు. మరో 150 ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.