Telugu States

50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు: బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ఇంతకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 50 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అధికారం కోసం కేసీఆర్‌ ఇంట్లో పంచాయతీ నడుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చుపెట్టి తన ఫాంహౌస్‌కు నీళ్లు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి జిల్లాలోని బునాదిగాని కాలువకు బస్వాపూర్‌ ప్రాజెక్టును అనుసంధానం చేయడానికి రూ.100 కోట్లు కేటాయించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. తుంగతుర్తిలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వారిని జైలుకు పంపించారన్నారు.
ఇక మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుపును కేసీఆర్‌ ఆపలేడన్నారు. ఉప ఎన్నిక వస్తేనే తుంగతుర్తిలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

Related Articles

Back to top button