More

    ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 50 షాపులు దగ్ధం

    ఢిల్లీలోని చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథి ప్యాలెస్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌లో ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనున్న దుకాణాలకు కూడా వ్యాపించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40 ఫైరింజన్లతో రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. బిల్డింగ్‌లోని చాలా షాపులు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు.

    స్థానికులు రాత్రి 9.20 గంటలకు ఘటనపై తమకు సమాచారం అందించారని, వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఓల్డ్ ఢిల్లీలో ఈ ప్రాంతంలో ఎంతో ఇరుకైన దారులు ఉండడంతో.. అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోవడం కష్టమైంది. విద్యుత్ తీగలకు మంటలు తాకడంతో ఆ ప్రాంతంలోని పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

    Trending Stories

    Related Stories