More

  అక్కడ బీజేపీలోకి జేడీయూ విలీనం..!

  బీహార్‌లో ఇటీవలి కాలంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీతో ఇటీవల ఆర్జేడీ తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే..! ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూకు చెందిన నేతలు జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కు షాకుల మీద షాక్ లు తగులుతూ ఉన్నాయి. ఇక మణిపూర్‌లో జేడీయూకు ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. జేడీయూ ఎమ్మెల్యేల విలీనాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నితీశ్ కుమార్‌కు ఇటీవలి కాలంలో చాలానే షాక్ లు ఇస్తోంది బీజేపీ. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఏడు సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అందులో ఆరుగురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. ఆగస్టు 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరడంతో అక్కడ జేడీయూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

  60 మంది సభ్యులున్న మణిపూర్ విధానసభలో జనతాదళ్ యునైటెడ్‌కు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 5 మంది సిఎం ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో విలీనమయ్యారు. ఎమ్మెల్యేలలో ఖుముక్చమ్ జాయ్‌కిసన్ సింగ్ (తంగ్‌మీబాండ్), మహ్మద్ అచాబ్ ఉద్దీన్ (జిరిబామ్), తంజామ్ అరుణ్‌కుమార్ (వాంగ్‌ఖేయ్), న్గుర్‌సంగ్లూర్ సనేట్ (తిపైముఖ్), మరియు ఎల్.ఎమ్. ఖౌటే (చురాచంద్‌పూర్) ఉన్నారు. లిలాంగ్ నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాత్రమే కాషాయ పార్టీలో చేరలేదు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం JD(U)ని BJPలో విలీనానికి స్పీకర్ తోక్చోమ్ సత్యబ్రత సింగ్ అంగీకరించినట్లు మణిపూర్ విధానసభ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ తెలియజేశారు.

  నితీష్ 2005లో తొలిసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించారు. 2010 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారు. 2013లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. 2015లో ఆర్జేడీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2017లో పొత్తు తెగిపోయి మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 ఎన్నికలలో బీహార్‌లో JDU-BJP కూటమితో పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు, 2 సంవత్సరాల తరువాత, మళ్ళీ బీజేపీతో పొత్తును తెంచుకున్నాడు. RJDతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

  Trending Stories

  Related Stories