NationalTelugu States

బెంగళూరు ‘మత్తు’లో తెలంగాణ ఎమ్మెల్యేలు..!

కర్నాటక డ్రగ్స్ కేసు తెలంగాణ ఎమ్మెల్యేలను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. ఫిబ్రవరి 26న వెలుగుచూసిన ఈ కేసులో.. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మత్తుబాబుల పేర్లు బయటపడుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల పేర్లు బయటికిరాగా.. ఇప్పుడా సంఖ్య తొమ్మిదికి చేరింది. హైదరాబాద్‎కు చెందిన వ్యాపారి కలహర్ రెడ్డి, తనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని పోలీసులకు వెల్లడించేందుకు అంగీకరించడాట. దీంతో ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బెంగళూరు గోవిందపుర పోలీసుల కస్టడీలో ఉన్న కలహర్ రెడ్డితో పాటు, కేసులో మరో నిందితుడు, ట్రావెల్స్ యజమాని రతన్ రెడ్డి సైతం వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వీరి స్టేట్ మెంట్ ను రికార్డు చేసి, ఆ వెంటనే ఎమ్మెల్యేలను విచారించాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించారు. కేసులో ప్రధాన పాత్రధారి అయిన కన్నడ నిర్మాత శంకర్ గౌడ ఏర్పాటు చేసే పార్టీలకు పలువురు నేతలు హాజరవుతుండేవారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కన్నడ సినిమావాళ్లకు డ్రగ్స్ సప్లయి చేసే కొందరు నైజీరియా వ్యక్తుల అరెస్ట్‎తో డొంక కదిలింది. ఆపై శంకర్ గౌడతో పాటు మరింత మంది వ్యాపారులు, ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదే కేసులో సందీప్ రెడ్డితో పాటు ఇప్పటికే ఓ చిన్న హీరోను కూడా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ఇప్పటికే పోలీసుల రికార్డుల్లోకి ఎక్కగా, పూర్తి విచారణ జరిగితే మరింత మంది పేర్లు బయటకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే తనతో పాటు మరింత కొంతమందిని తీసుకొచ్చేవారని పోలీసులు గుర్తించారు. అయితే, వారెవరన్నది ఆ ఆ ఎమ్మెల్యే నోటి నుంచి చెప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే నోరు విప్పితే మరికొంతమంది ప్రజాప్రతినిధిల పేర్లు బయటికొచ్చే అవకాశం వున్నట్టు సమాచారం.

ఇదిలావుంటే, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయన్న సమాచారమే తప్ప, వారు ఎవరన్నదీ ఇంతవరకూ బయటకు రాలేదు. ఒకసారి కర్ణాటక పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి, ఆపై నోటీసులు పంపితే వారి పేర్లు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే, పక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు కేసులో ఉండటంతో కర్ణాటక పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దర్యాఫ్తు విషయంలో తాము ఏమాత్రం తొందరపడటం లేదన్న బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ శరణప్ప వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × five =

Back to top button