విశాఖ ఆర్కే బీచ్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహం ఇసుకలో కూరుపోయింది. కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు. సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కేబీచ్‌లో శవమై తేలింది. ఒంటిపై దుస్తులు సరిగా లేకపోవడం, ఇసుకలో సగం డెడ్‌బాడీ కప్పేసినట్టుగా ఉండడంతో.. ఎవరో కావాలని చంపేశారనే అనుమానాలకు తావిస్తోంది. స్వాతికి పెళ్ళై ఏడాది అని.. ఐదు నెలల గర్భిణీ అని అంటున్నారు. అదృశ్యం కాకముందు భర్తతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఉదయం బీచ్ లో వాకింగ్ కు వచ్చిన వాకర్స్ ఈ మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.