National

తీరు మార్చుకోని మమతా.. 5 లక్షల ఫైన్ వేసిన కలకత్తా హై కోర్టు

నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే..! ప్రజలు ఆమెకు వ్యతేరేకంగా తీర్పును ఇచ్చి.. బీజేపీ నేత సువేందు అధికారికి విజయాన్ని అందించినప్పటికీ ఆమె మాత్రం తన ఓటమిని ఒప్పుకోవడం లేదు. నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలలో ఎన్నో తప్పులు జరిగాయని.. తనను ఓడించడానికి కుట్ర పన్నారంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ.. కేసు విచారణ చేస్తున్న జడ్జిల విషయంలో కూడా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాల కేసు విచారణ నుంచి జస్టిస్ కౌశిక్ చందాను తప్పించాలన్న ఆమె విజ్ఞప్తిపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. నందిగ్రామ్ లో మమతపై బీజేపీ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మమత తరఫు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ.. జస్టిస్ కౌశిక్ చందా చాలా మంది బీజేపీ నేతలతో కనిపించారని.. ఈ కేసు విచారణను వేరే ధర్మాసనానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ కౌశిక్ చందా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. మమతకు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ.. కేసు నుంచి తనకు తానుగా తప్పుకొన్నారు. ఓ వ్యక్తి రాజకీయ పార్టీ దగ్గరకు వెళ్లినంత మాత్రాన సదరు వ్యక్తి ఆ పార్టీకే చెందిన వ్యక్తి అని అనుకోవడానికి లేదని జస్టిస్ కౌశిక్ చందా అన్నారు. ఈ కేసు విషయంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేవు. ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణకు ముందే నాకు పార్టీలతో సంబంధాలు అంటగట్టి తీర్పును ప్రభావితం చేస్తారని చెబుతున్నారని విమర్శించారు. పిటిషనర్ అనుకున్నంత మాత్రాన న్యాయమూర్తులు పక్షపాత ధోరణి చూపిస్తారని అనుకోకూడదని జస్టిస్ కౌశిక్ చందా చెప్పడమే కాకుండా 5 లక్షల రూపాయల ఫైన్ ను విధించారు. జూన్ 18న కేసు విచారణకు వచ్చిన వెంటనే తృణమూల్ పార్టీ నేతలు, కార్యకర్తలు తాను బీజేపీతో ఉన్నానంటూ ఫొటోలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలకత్తా హైకోర్టుకు జడ్జిగా రాకముందు జస్టిస్ చందా బీజేపీ ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారని కలకత్తా బార్ అసోసియేషన్ తెలిపింది. తాను ఒకప్పుడు బీజేపీ కన్వీనర్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని కానీనేను ఒక పార్టీ పట్ల పక్షపాతం చూపే వ్యక్తిని కానని చందా చెప్పారు. తన వ్యక్తిగత అభీష్టానుసారం కేసు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కేసును తన బెంచ్ విచారించకుండా, ఇతర బెంచ్ కు మార్చాలని సూచించారు. న్యాయవ్యవస్థపై దురుద్దేశాలు ఆపాదించినందుకు మమతా బెనర్జీ రూ. 5 లక్షల జరిమానాను విధిస్తున్నామని కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది. జరిమానా మొత్తాన్ని కోవిడ్ -19 బాధిత న్యాయవాదుల కుటుంబాలకు ఉపయోగిస్తామని కలకత్తా హైకోర్టు తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − 2 =

Back to top button