National

నెలకు అయిదు కోట్ల వ్యాక్సిన్లు.. ఆ ఒక్క ప్లాంట్ నుండే

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీర్చడానికి భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భారత్ బయోటెక్ కూడా కొవ్యాక్సిన్ విషయంలో అత్యంత ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ లో నాలుగు-అయిదు కోట్ల వ్యాక్సిన్లు ప్రతి నెలా తయారు చేయాలని భావిస్తోంది. ఆగష్టు నెల ముగిసే సమయానికి ప్రతి నెలా అయిదు కోట్ల వ్యాక్సిన్లు తయారు చేయనున్నారు.

కర్ణాటక రాష్ట్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ కె.సుధాకర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత్ బయోటెక్ ఫౌండర్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన కుమార్తె డాక్టర్ జల ఎల్లాలతో పాటూ కంపెనీ టీమ్ తో తాము మాట్లాడామని సుధాకర్ తెలిపారు. సంస్థకు కావాల్సిన సహాయం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తమ రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లను ఇవ్వడానికి కంపెనీ అంగీకారం తెలిపిందని సుధాకర్ స్పష్టం చేశారు. కోలార్ జిల్లాలోని మాలూరు వద్ద భారత్ బయోటెక్ ఫ్యాక్టరీలో జూన్ నెలాఖరుకల్లా నెలకు కోటి వ్యాక్సిన్లు, జులై నెలాఖరు కల్లా రెండు నుండి మూడు కోట్ల వ్యాక్సిన్లు, ఆగష్టు నెలాఖరు కల్లా నాలుగు-అయిదు కోట్ల వ్యాక్సిన్లు తయారు చేసేలా ఏర్పాట్లను చేయబోతున్నామని అన్నారు. ప్రతి నెలా 5 కోట్లకు పైగా వ్యాక్సిన్లను కేవలం ఈ ప్లాంట్ నుండే తయారు చేయనున్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ లో నెలకు ఒక్క కోటి వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేసే వీలు ఉండగా.. కోలార్ లోని ప్లాంట్ లో మాత్రం అయిదు కోట్ల వ్యాక్సిన్లు ప్రతి నెలా తయారు చేయవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

భారత్ లోని వేరియంట్ల పైనా, యూకే వేరియంట్ల పైనా కొవ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్‌ టీకాతో భారత్‌లో ప్రబలంగా ఉన్న బీ.1.167 కరోనా రకంతో పాటు యూకే వేరియంట్‌ అయిన బీ.1.1.7 రకంపైనా సమర్థంగా పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. అధ్యయన ఫలితాలను ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురించింది. ఇప్పటి వరకూ కనుక్కున్న అన్ని వేరియంట్ల పైనా కొవ్యాక్సిన్ ప్రభావం చూపిస్తూ ఉందని.. ఈ రెండు రకాలను సమర్థంగా ఎదుర్కోగలిగే యాంటీబాడీలు కొవాగ్జిన్‌ టీకా వల్ల ఉత్పత్తవుతున్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ అధ్యయన పత్రాన్ని సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విట్టర్‌లో ఇటీవలే పోస్ట్‌ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × three =

Back to top button