National

మారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు.. గవర్నర్ దత్తాత్రేయను తోసేసారు..!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి బరితెగించారు. నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు కానీ.. అవతలి వారిని అగౌరవపరిచేలా కించపరిచేలా మాత్రం చేయడం విచారకరం.

డిసెంబర్ 15 2020న కర్నాటక శాసన మండలి సమావేశాల్లో జరిగిన గొడవలో ధర్మెగౌడను కుర్చీలోనుంచి లాగి కిందకు తోసేశారు కాంగ్రెస్ సభ్యులు. ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ సభాపతి స్థానంలో ఉండగా.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ధర్మె గౌడను తోసేసి.. కిందకు లాక్కెళ్లారు కాంగ్రెస్ సభ్యులు. దీంతో తీవ్ర అవమానానికి గురైన కర్నాటక కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది దేశ రాజకీయాల్లో ఇది ఓ సంచలనంగా మారిన ఘటన.

ఇప్పుడు మళ్లీ అటువంటి విధానానికే ఒడిగట్టారు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ సారి ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్ నే అవమానించారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తేదీ 26 ఫిబ్రవరి 2021న  ఉదయం గవర్నర్ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం మొదటి నుంచే కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. తమ తమ సీట్ల నుంచి లేచి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకడంతో దత్తాత్రేయ తన ప్రసంగం చివరి వ్యాఖ్యలను చదివి తన ప్రసంగం పూర్తనైనట్లు భావించాలంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై అధికార బీజేపీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.

గవర్నర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్మెండ్ చేయాలని బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టింది. గవర్నర్‌ను నెట్టేసిన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన సభ్యులను సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ ఆమోదం తెలిపారు.

ఇదీ చట్ట సభలో కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 − nineteen =

Back to top button