12 ఏళ్ల బాలికను మసీదులో అత్యాచారం చేసిన ఇమామ్

0
708

ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. నీళ్ల కోసం మసీదు దగ్గరకు వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలికపై మసీదులో ప్రార్థనలు చేయించే వ్యక్తి అత్యాచారం చేశాడు. మసీదు లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు చెబుతోంది. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గత ఆదివారం సాయంత్రం సమయంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి వయసు 47 సంవత్సరాలు. బాలిక అప్పుడప్పుడు ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకోవడానికి మసీదు దగ్గరికి వెళుతూ ఉండేది. ఆదివారం సాయంత్రం సదరు 12 ఏళ్ల బాలిక మసీదు దగ్గరికి వెళ్ళింది. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన 47 ఏళ్ల కామాంధుడు బాలికను మసీదు లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి ఏడుస్తూ వచ్చిన బాలికను.. తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా మొత్తం విషయాన్ని చెప్పేసింది. వెంటనే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఆ వ్యక్తిపై ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేశామని.. 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నామని అన్నారు. అరెస్టు సమయంలో పోలీసులను పెద్ద ఎత్తున మసీదు ముందు మోహరించామని తెలిపారు. ఘజియాబాద్ ‘లోని’ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here