బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

0
908

బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతి చెందగా.. 450 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ లో ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంటైనర్ డిపోలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

గతరాత్రి 9 గంటల సమయంలో చిట్టగాంగ్ లోని సీతాకుంద ఉప జిల్లాలోని కడమ్ రాసుల్ ప్రాంతంలోని బీఎమ్ కంటైనర్ డిపోలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమాచారం తెలుసుకుని.. అక్కడికి చేరుకునేలోపే మంటలు దావానలంలా వ్యాపించాయి. 40 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది కూడా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు.. పోలీసు సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందినట్లు అక్కడి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

కాగా.. రసాయనాలను కలిగి ఉన్న కంటైనర్లు పేలడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకూ 43 మృతదేహాలను గుర్తించి, వాటన్నింటినీ మార్చురీకి తరలించారు. గాయపడిన వారిని సైనిక, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కంటైనర్ల పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయని, శిథిలాలు అరకిలోమీటర్ దూరంలోని ఇళ్లపై పడ్డాయనని స్థానికులు తెలిపారు. కంటైనర్లలో ఉన్న ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nineteen + 6 =