International

నాలుగు హిందూ దేవాలయాల ధ్వంసం..!

శనివారం నాడు బంగ్లాదేశ్‌లో నాలుగు హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. హిందువులకు చెందిన అనేక దుకాణాలపై దాడులు జరిపారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలోని రుప్షా ఉజిలాలోని షియాలీ గ్రామంలో జరిగింది. శనివారం సాయంత్రం 5:45 గంటల సమయంలో దాడి జరిగింది. ఈ సమయంలో దుండగులు కొన్ని ఆయుధాలతో గ్రామంలోని హిందువులపై దాడికి పాల్పడ్డారు. నాలుగు దేవాలయాలు అపవిత్రం చేయబడ్డాయి. కొందరి ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. ఈ వ్యక్తులు 6 దుకాణాలను కూడా ధ్వంసం చేశారు. సంఘటన గురించి తెలుసుకున్న తరువాత, పోలీసు సూపరింటెండెంట్ (SP) తో సహా సీనియర్ పోలీసు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ సంఘటన తరువాత, గ్రామస్తులలో భయం నెలకొంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసు బృందాన్ని మోహరించారు.

స్థానిక నివాసితులు, పూజ పరిషత్ నాయకుల ప్రకారం మహిళా భక్తుల బృందం శుక్రవారం (ఆగస్టు 6) రాత్రి 9 గంటల సమయంలో పుర్బా పారా దేవాలయం నుండి షియాలీ శ్మశానవాటిక వరకు ఊరేగింపు చేపట్టింది. వారు తమ మార్గంలో ఒక మసీదును దాటారు. ఈ సమయంలో ఊరేగింపుపై ఇమామ్ (ఇస్లామిక్ మతాధికారి) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హిందూ భక్తులు మరియు ముస్లిం మతగురువుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ విషయాన్ని శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని హిందువులు నిర్ణయించారు.

అయితే ఇంతలోనే కొందరు ఆ గ్రామానికి చెందిన వారు.. గరిటెలు, కొడవళ్లతో సామూహిక విధ్వంసం సృష్టించారు. స్థానిక హిందువులైన గణేష్ మల్లిక్ (ఫార్మసీ), శ్రీబాస్ మల్లిక్ (కిరాణా), సౌరభ్ మల్లిక్ (టీ మరియు కిరాణా), అనిర్బన్ హీరా (టీ షాప్) అతని తండ్రి మజుందార్‌ దుకాణాలను దాడులు చేశారు. శిబ్బద్ ధార్ ఇంటిలోని ‘గోవింద ఆలయం’ ను కూడా ధ్వంసం చేశారు. హరి దేవాలయం, దుర్గా ఆలయం, షియాలి మహాసంశన్ ఆలయాలను ధ్వంసం చేశారు. ఆలయంలో ఉంచిన అనేక విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. హిందువులు అడ్డుకోడానికి ప్రయత్నించినప్పుడు దుండగులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కొద్దిసేపటికి గ్రామస్తులంతా ఏకమవ్వడంతో నిందితులు నేరం జరిగిన ప్రదేశం నుండి పారిపోయారు. పూజ పరిషత్ అధ్యక్షుడు శక్తిపాద బసు మాట్లాడుతూ హిందువులు షియాలి క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు వారిని పట్టించుకోకుండా పంపించేశారు. ఇంతలో దుండగులు హిందువులపై దాడులకు పాల్పడ్డారు. గ్రామంలో ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి హింస మరియు విధ్వంసం జరగలేదని స్థానికులు చెప్పారు. సమీపంలోని చాంద్‌పూర్ గ్రామానికి చెందిన యువకులు ఈ దాడికి పాల్పడ్డారని హిందువులు ఆరోపించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), అదనపు SP తో కూడిన పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో పోలీసు బృందాలు మోహరించామని, షియాలి గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని ఖుల్నా ఎస్పీ మహబూబ్ హసన్ తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకూ 10 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

ఈద్ సమయంలో షేక్ హసీనా నియోజకవర్గంలో హిందువులపై దాడులు:

జూలై 21 న బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిస్టుల గుంపు ఉదయం 9 గంటల సమయంలో హిందులపై దాడులు చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని కోటాలిపారాలోని కలబరి యూనియన్ పరకట బజార్‌లో చోటు చేసుకుంది. గోపాల్‌గంజ్ అవామీ లీగ్ అధిపతి, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా నియోజకవర్గంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది.

బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ ట్విట్టర్‌లో ఈద్-అల్-అధా రోజునే ఈ దాడి జరిగినట్లు తెలియజేసింది. ఈ సంఘటనలో పోలీసు అధికారులతో సహా 50 మందికి పైగా గాయపడినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. కొందరు దుండగులు హిందువులకు చెందిన దుకాణాలు, ఇళ్లను ధ్వంసం చేశారు. జూలై 19 న పరకట గ్రామంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సమయంలో మొదట గొడవ జరిగింది. జనకల్యాణ్ హై స్కూల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో, ఆట ఫలితం గురించి రెండు వైపుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు రోజుల తరువాత జూలై 21 న, 18 ఏళ్ల సజల్ జెయిన్, 38 ఏళ్ల జమాల్ మల్లిక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ ఒక మతపరమైన మలుపు తీసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో వారు హిందువుల దుకాణాలు, ఇళ్లు ధ్వంసం చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. నిందితులను రుస్తుం మల్లిక్, నన్ను మల్లిక్, జాసిమ్ మొల్లా, ఫైజుల్ మల్లిక్, బాబుల్ మల్లిక్ (26) గా గుర్తించారు. వారు గ్రామంలో హిందువులు లేకుండా చేస్తామని నినాదాలు చేశారు. ఈద్ రోజున మనుషులనే దేవుడికి అర్పిస్తామని వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fifteen − twelve =

Back to top button