ఆడ దూడపై అత్యాచారం.. వీడియో వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

0
738

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆడ దూడను క్రూరంగా హింసించి, అత్యాచారం చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో నలుగురు నిందితులు జుబైర్, తలీమ్, వారిస్, చునాలను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు రోడ్డుపై ఉన్న దూడపై అత్యాచారం చేయగా, మరో నిందితుడు ఆ దూడ శబ్దం చేయకుండా అడ్డుకోవడం వైరల్ వీడియోలో ఉంది. ఘటన జరిగిన సమయంలో మరో వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారిలో ఒకరు ఈ చర్యను చిత్రీకరించారని ఆరోపించారు. ఫతే మహమ్మద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అల్వార్ జిల్లాలోని చోపంకిలోని కొండ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. మేవాత్ కిందకు తిజారా ఫాల్స్ ప్రాంతం వస్తుంది. ఇదే ప్రాంతంలో ఆవుల అక్రమ రవాణా, స్మగ్లర్లపై పోలీసుల ఎన్‌కౌంటర్లు వంటివి గతంలో చోటు చేసుకున్నాయి.

“నిందితులందరూ 20-22 ఏళ్ల మధ్య వయసున్న వారు. నిందితుల్లో ఒకరు అసహజ చర్యకు పాల్పడ్డారు, మరొకరు దూడను పట్టుకున్నారు. మరో నిందితుడు ఈ చర్యను చిత్రీకరించాడు. నాలుగో నిందితుడు ఈ దారుణం చోటు చేసుకుంటున్నప్పుడు అక్కడే ఉన్నాడు” అని అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శంతను కె సింగ్ చెప్పారు. “నిందితులపై సెక్షన్ 377 [భారత శిక్షాస్మృతి యొక్క] కింద కేసు నమోదు చేయబడింది. ఆడ దూడకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ దూడ నిందితులు ఉన్న అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి చెందినది” శాంతను తెలిపారు.

ఆగ్రహం-నిరసన

ఈ ఘటన జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బుధవారం, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని తిజారాలో అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాదయాత్ర నిర్వహించి, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి మెమోరాండం అందజేశారు. హేయమైన చర్యకు నిరసనగా అల్వార్ జిల్లా తిజారాలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో దాదాపు 5,000 మంది ప్రజలు పాల్గొన్నారు. భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనకు నిరసనగా ఆ ప్రాంతంలో దుకాణాలు మూసివేశారు. ఈ కేసులో నిందితుల్లో ఎవరికీ వాదించకూడదని స్థానిక న్యాయవాదులు నిర్ణయించారు. “ఈ కిరాతక చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నిందితులకు ఉరి శిక్ష విధించాలి’’ అని తిజారాలోని జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకారులు డిమాండ్ చేశారు.