More

  మోప్లా మతోన్మాదులు స్వాతంత్య్ర వీరులా..?

  ప్రస్తుతం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నాయి. ఈ సందర్భంగా ఏడాదిపాటు దేశమంతటా కూడా ఆజాదీ కా అమృతోత్సవ్ పేరుతో మనం ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 నుంచి మొదలైన ఈ ఉత్సవాలు వచ్చే ఏడాది 2022 ఆగస్టు 15 వరకు కొనసాగనున్నాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందిచడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను మననం చేసుకోవడం జరుగుతోంది.

  అయితే ఇదే సమయంలో నరేంద్రమోదీ సర్కార్ మరోక ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డులను పరిశీలించి.., తప్పుడు తర్కాలతో స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో చేర్చబడిన కొంతమంది పేర్లను ఆ జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. దీంతో ఈ జాబితా తొలగింపుపైనా దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది.

  నిజానికి కొంతమంది  భారత స్వాతంత్ర్య పోరాటయోధులు కాకున్నా కూడా., కేవలం మైనారీటి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా, వారికి స్వాతంత్ర్య సమరయోధులుగా దర్జాను, గుర్తింపును ఇవ్వడం జరుగుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

  ఇంతకీ ఎవరు స్వాతంత్ర్య సమరయోధులు? ఇస్లామిక్ మతోన్మాదంతో ఊగిపోతూ, దేశంలో ఖలీఫా రాజ్యాన్ని స్థాపిస్తామని ప్రతిజ్ఞలు చేసి అంతులేని హింసాకాండకు పాల్పడినవారు స్వాతంత్ర్య సమరయోధులవుతారా? ఖిలఫత్ మూవ్ మెంట్ పేరుతో అమాయకులైన వేలాది మంది హిందువులను మూక హత్యలు చేసినవారు, ఇస్లామ్ స్వీకరిస్తారా? లేక చస్తారా? అంటూ కత్తితో భయపెట్టి మత మర్పిడీలు చేసినవారిని, మహిళలను ఎత్తుకెళ్లి బలవంతంగా వివాహాలు చేసుకున్నవారిని మనం ఏమని పిలవాలి? ఆధునిక భారత దేశ చరిత్రలో తాలిబన్ మనస్తత్వానికి మొదటి ఉదాహరణగా 1921లో కేరళలో జరిగిన మోప్లా తిరుగుబాటును ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ పేర్కొనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?      

  అలాగే ఖిలాఫత్ ఉద్యమం పేరుతో హత్యలు, లుటీలు, మహిళలపై అత్యాచారాలు, మతం మార్పిడీలు, దేవాలయాలను ధ్వంసం చేసినవారంతా… ఆ తర్వాత కాలంలో మేమూ చేసిన ఈ దమనకాండ అంతా కూడా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో భాగమేనని కలరింగ్ ఇస్తూ ప్రకటనలు చేయగానే…, వారంతా కూడా స్వాతంత్ర్య పోరాటయోధులు అయిపోయినట్లేనా?

  అటు హిందూ వ్యతిరేక…మైండ్ సెట్ తో ఉన్న వారు కూడా పోరాటయోధులేనంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సంస్థలో తిష్టవేసుకున్న లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ , కుహనా చరిత్రకారులు తీర్మానం చేసేస్తే ఈ నరహంతక మూకలను మనం స్వాతంత్ర్య పోరాటయోధులుగా అంగీకరించాల్సిందేనా? ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.

  కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్-ICHR సంస్థ తరపున ఇండియన్ ఫ్రీడం స్ట్రగుల్ 1857 టు 1947 అనే పేరుతో ఓ గ్రంథాన్ని ప్రచురించింది. 2019లో ఈ గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా జరిగింది.

  అయితే ఆ పుస్తకంలోని ఐదో వాల్యూమ్ లో పేర్కొనబడిన వారియం కున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ, అతని సోదరులు, అలీ ముస్లియార్ తోపాటు, 387 మంది మోప్లా అమరవీరుల పేర్లను తీసివేసేందుకు కేంద్రం రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. డిక్షనరీలోని ఐదో వాల్యూమ్ లో పేర్కొనబడిన పేర్లను ICHR ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నిశీతంగా పరిశీలించి..సమీక్ష జరిపి ఒక రిపోర్టును రూపొందించినట్లుగా చెబుతున్నారు. నిజానికి 1921లో దేశంలో జరిగిన ఖిలాఫత్ మూవ్ మెంట్  దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగం కాదని, ఇస్లామిక్ మత రాజ్యం స్థాపన కోసం జరిగిన ఒక హింసాత్మక ఉద్యమమని ICHR ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ గుర్తించిందని చెబుతున్నారు. ఉద్యమం సమయంలో ఆందోళనకారులు చేసిన నినాదాలు, హింసాకాండ ఇదే విషయాన్ని రుజువు చేస్తుందని, హింసాకాండకు నాయకత్వం వహించిన వారియం కున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ  కొన్ని రోజులపాటు మలబారు ప్రాంతంలోఇస్లామ్ షరియా కోర్టులను ఏర్పాటు చేసి ఎంతో మంది హిందువులకు శిరచ్ఛేదం శిక్షలు అమలు చేశాడని.., ఈ మలబారు తిరుగుబాటులో ముస్లిం మోప్లాల చేతుల్లో హతమైనవారందరూ హిందువులు, బ్రిటిష్ అధికారులేనని ఆనాటి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

  ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా కేరళలోని మోప్లాలుగా పిలువబడే ముస్లింలు 1921 ఆగస్టు 20న స్థానిక భూస్వాములైన హిందువులు, అలాగే బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు ఉద్యమం ప్రారంభించారు. 2 వేలమంది తిరుగుబాటు దారులతోపాటు, 10 మందికి పైగా హిందువులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇంకా అనేక వేలమంది బలవంతంగా మతం మర్చాబడ్డారు. మోప్లాలు జరిపిన ఈ దౌర్జన్యాలు స్వాతంత్ర్య పోరాటం కోవలోకి ఎంతమాత్రం రావని, అలాగే 1921 నవంబర్ 21న జరిగిన వ్యాగన్ విషాదంలో మరణించినవారు కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగం కాదని ICHR సభ్యుడు ఐసాక్ తన సమీక్ష నివేదికలో తెలిపినట్లుగా ది ప్రింట్ వెబ్ తన కథనంలో పేర్కొంది.

  నిజానికి ఖిలాఫత్ ఉద్యమాన్ని బేస్ చేసుకుని 1921లో కేరళలోని మలబారు ప్రాంతంలోని మోప్లా ముస్లింలు చేసిన తిరుగుబాటు వెనుక వారి మతోన్మాద చరిత్రదాగి ఉందని అనేక చారిత్రక కథనాలు చెబుతున్నాయి.

  అవేంటో చూద్దాం.! మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది. టర్కీ ఒట్టోమాన్ సామ్రాజ్యం ముక్కలైంది. పాలస్తీనా, లెబనాన్, ఇరాక్, ఈజిప్టులు టర్కీ సామ్రాజ్యం నుంచి వేరు చేయబడ్డాయి. ఖలీఫా పదవిని రద్దు చేశారు. ఖలీఫా అనేది ముస్లిం దేశాలకు మతాధిపతిగా ఉండే ఒక పదవి. అంతకు ముందు ఖలీఫాగా టర్కీ పాలకుడు ఉండేవాడు. అతన్ని ఆ పదవి నుంచి తొలగించడంతో…, ఆయా దేశాల్లోని ముస్లింల కంటే…ఇక్కడ భారత్ లోని ముస్లింలు ఎక్కువగా ఆగ్రహోదగ్రులయ్యారు.

  మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అనే సోదరులు మౌలానా ఆజాద్ నేతృత్వంలో… టర్కీలో ఖలీఫా పదవీని పునరుద్దరించడమే లక్ష్యంగా ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు ఇదో గొప్ప అవకాశంగా గాంధీజీ భావించారు. మొదట్లో కాంగ్రెస్ కార్యకర్తలు…ముస్లింలులు కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. అయితే రానురాను హింస పెరిగిపోవడం, చౌరీ చోరీ ఘటనలో పోలీసు స్టేషన్ తగలబెట్టడం…పోలీసులు మరణించడంతో గాంధీజీ కూడా తన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు.

  అయితే ఖిలఫత్ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా షౌకత్ అలీ సోదరులు ఆశించిన మద్దతు లభించలేదు. కానీ…కేరళలోని మలబారు ప్రాంతంలోని ముస్లిం మోప్లా నాయకులు అలీ ముస్లియార్, అలాగే వారియం కున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ మాత్రం ఖిలఫత్ ఉద్యమాన్నిఆసరాగా చేసుకుని హిందువులే లక్ష్యంగా నరమేధం సృష్టించారు. హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేశారు. బలవంతంగా మత మార్పిడిలు చేశారు. వేల సంఖ్యలో జనాన్ని చంపేశారు. కేరళలో ధ్వంసం చేయబడిన దేవాలయాలకు లూటీలకు, గృహదహనాలకు లెక్కలేదు. ఈ నరమేధానికి భయపడి వేలాది మంది హిందువులు మలబారు ప్రాంతాన్ని వదలి వలసపోవాల్సి వచ్చింది. 

  వారియం కున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ మలబారు ప్రాంతాన్ని ఖలీఫా రాజ్యాంగా ప్రకటించాడు. నీలంపూర్ కేంద్రంగా ఆరు నెలల పాటు ఇస్లామ్ షరియాను అనుసరించి పరిపాలన చేశాడు. కుంజాహమ్మద్ హాజీ జరిపిన నరమేధం మలబారులో ఆరు నెలలపాటు కొనసాగింది. మలబారులోని బావుల్లో మృతదేహాలు కుప్పలుకుప్పలుగా దర్శనమిచ్చాయి. బ్రిటీష్ సైన్యం రంగంలోకి దిగిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. మలబారు ప్రాంతాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించాలని..అప్పుడే శాంతి చర్చలకు తాను సిద్ధమని బ్రిటీష్ వారికి రాయబారం పంపాడు. దీంతో 1922లో బ్రిటీష్ సైన్యం హాజీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని నమ్మపలికి.., ఒక అజ్ఞాత ప్రదేశంలో వారియం కున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ ని అలాగే అతని అనుచరులను అరెస్టు చేసింది. ఆ తర్వాత విచారణ జరిపి మరణశిక్షను విధించింది. 1921లో మోప్లా ముస్లింలు జరిపిన మరణాకాండకు…, ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్లు జరుపుతున్న హింసాకాండ…,ఈ రెండింటి మైండ్ సెట్ కు పెద్దగా తేడాలేదని, కాకపోతే ఇస్లామిక్ మతోన్మాద తాలిబన్ల మనస్తత్వం ఏలాంటిదో మోప్లా తిరుగుబాటుతో భారత దేశం ముందే చూసిందని.. ఈ నెల ఆగస్టు 19న కోజికోడ్ లో జరిగిన ఓ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ కంపేర్ చేయడం జరిగింది.

  Trending Stories

  Related Stories