ఎంత మంది బయట వ్యక్తులు జమ్మూ కశ్మీర్ లో భూములు కొన్నారో తెలుసా..?

0
714

జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మంది ఆ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం పార్లమెంటు దిగువ సభకు తెలియజేశారు. “జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ బయటి నుండి 34 మంది వ్యక్తులు జమ్మూ, రియాసి, ఉధంపూర్, గందర్‌బల్ జిల్లాలో ఆస్తులను కొనుగోలు చేశారు,” అని లిఖితపూర్వకంగా ఆయన వివరాలను పంచుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లూర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరణ ఇచ్చారు.

జమ్మూ కశ్మీర్ వెలుపల ఉన్న పౌరులకు భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రాయ్ లోక్ సభకు తెలిపారు. ఈ దిశలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. పటిష్టమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అమల్లో ఉందని రాయ్ సభకు చెప్పారు. రాష్ట్రంలో పగలు, రాత్రి పెట్రోలింగ్ ఉంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చురుకైన ఆపరేషన్లు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడిని అడ్డుకోవడానికి నాకాస్, రోడ్ ఓపెనింగ్ పార్టీలలో 24 గంటలూ చెకింగ్ లను నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా వ్యూహాత్మక పాయింట్ల వద్ద భద్రతను మరింత పెంచబడిందని రాయ్ అన్నారు.

అంతకుముందు డిసెంబర్ 2021లో, జమ్మూ కశ్మీర్ వెలుపలి నుండి ఇద్దరు వ్యక్తులు.. ఆగస్టు 2019 సమయంలో ఒక ఆస్తిని కొనుగోలు చేశారని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. అక్టోబర్ 2020లో, జమ్మూ కశ్మీర్ లో వ్యవసాయేతర భూములు కొనుగోలు చేయడానికి భారతీయ పౌరులకు అనుమతిస్తూ కొత్త భూ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

జమ్మూ కశ్మీర్ కోసం కొత్త భూ చట్టాలు ఆగస్టు 2019లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, ఆర్టికల్ 370ని రద్దు చేసింది. 2019కి ముందు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంది. శాశ్వత నివాసితులు మాత్రమే అక్కడ భూమిని కొనుగోలు చేయగలరు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో పలు ప్రాంతాలకు చెందిన వారు కూడా భూములను కొనగలుగుతూ ఉన్నారు.