National

ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. హై కోర్టు ముందు కానిస్టేబుల్ ఆత్మహత్య

కొద్దిరోజుల కిందటే ఢిల్లీలోని రోహిణీ కోర్టులో షూటౌట్ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ముందు పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో విధుల్లో ఉంచిన రాజస్థాన్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీకి ( Rajasthan Armed Constabulary) చెందిన 30 ఏళ్ల కానిస్టేబుల్ బుధవారం తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని టింకు రామ్ గా గుర్తించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లోని కోట్‌కాసిమ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. అక్కడ నుండి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వారు తెలిపారు.

“రాజస్థాన్ సాయుధ కాన్స్టాబులరీకి చెందిన ఒక కానిస్టేబుల్ తన భద్రతా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది” అని పోలీసు డిప్యూటీ కమిషనర్ (న్యూఢిల్లీ) దీపక్ యాదవ్ చెప్పారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారని దీపక్ యాదవ్ వెల్లడించారు.

పోలీసుల ప్రకారం సెలవు నుండి తిరిగి వచ్చిన తర్వాత బుధవారం ఉదయం 9.30 గంటలకు కానిస్టేబుల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నెం. 3 వద్ద విధుల్లో చేరాడు. అతను 9.30 గంటల ప్రాంతంలో డ్యూటీకి వచ్చాడని.. సెలవు నుండి తిరిగి వచ్చిన తరువాత అతను ఈ రోజు విధుల్లో చేరాడని సహచరులు అన్నారు. కొద్ది రోజుల క్రితం రోహిణి కోర్టులో గ్యాంగ్‌స్టర్ ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో కాల్చి చంపబడిన నేపథ్యంలో ఢిల్లీలోని కోర్టులు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధానిలోని అన్ని కోర్టులలో పోలీసులు భద్రతను పెంచారు. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాన్ని గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తరువాత, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు.

Related Articles

Back to top button