More

  ముప్పుతిప్పలు పెట్టిన మూడు సినిమాలు!

  ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’- ‘ఊర్వశివో రాక్షసివో’- ‘బనారస్’

  సినిమాలంటే ఇంటిల్లిపాది హాయిగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి! మరి ఇప్పుడొస్తున్న సినిమాలు అలా ఉంటున్నాయా? అంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టమే! ఈ రోజు (నవంబర్ 04, 2022) థియేటర్లలోకి ముచ్చటగా మూడు సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’. ఈ చిత్రం సిల్లీ కామెడీతో సాగి బోర్ కొట్టించింది. సంతోష్ శోభన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు.
  సంతోష్ శోభన్ తన గత సినిమాల్లో కంటే ఇందులో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మరియు కొన్ని సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా సంతోష్ శోభన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకగా నటించిన ఫరియా అబ్దుల్లా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. సినిమా కొన్ని చోట్ల ఎంటర్టైన్ గా సాగినా అక్కడక్కడ నెమ్మదిగా సాగుతుంది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. అలాగే కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ టోన్ లో నడిపాడు దర్శకుడు. సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, మేర్లపాక గాంధీ మాత్రం ఆ ఎమోషన్స్ ను తెరపై పండించకుండా క్లుప్తంగా ముగించేశాడు. ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ అంటూ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోవాదం వల్ల సినిమా ఫలితం దెబ్బ తింది.
  ఇక రెండో సినిమా : ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం నిర్మించిన చిత్రమిది. అల్లు వారి హీరో అల్లు శిరీష్ నుంచి కాస్త గ్యాప్ తర్వాత విడుదలైన తాజా సినిమా. ప్రస్తుత జనరేషన్ లో ఉన్న ఆసక్తికరమైన పాయింట్ చాలా నీట్ గా.. మంచి ఎమోషన్స్, ఫన్ తో మెప్పించే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఈ చిత్రంలో కనిపించే ప్రతి పాత్ర కూడా తమ నుంచి ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ చాలా కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో కనిపించి మంచి నటనతో ఆకట్టుకుంటుంది. గ్లామ్ సహా నటనతో సినిమాలో మంచి హైలైట్ గా నిలిచింది. సినిమాలో మెయిన్ హైలైట్ అల్లు శిరీష్ ఇచ్చిన పెర్ఫామెన్స్ అని చెప్పాలి. తన గత చిత్రాలని ఈ చిత్రంతో పోలిస్తే తన నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ కూడా మంచి ఇంప్రూవ్ కాగా కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ లో అయితే సిరీస్ చాలా బాగా నటించాడు. అలాగే హీరోయిన్ తో కెమిస్ట్రీ సీన్స్ కూడా సినిమాలో బాగున్నాయి. సినిమాలో థీమ్ మరీ కొత్తదానిలా అనిపించదు దాదాపు తెలిసినట్టుగానే ఉంటుంది. దర్శకుడు రాకేష్ విషయానికి వస్తే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రెజెంట్ జెనరేషన్ లో ఓ కీలక పాయింట్ ని పట్టుకొని కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా వరకు బ్యాలన్స్ చేస్తూ నడిపిన విధానం బాగుంది. ముత్తమీద ఫర్వాలేదు.
  మూడో చిత్రం : ‘బనారస్’ ఇదొక రొటీన్ లవ్ డ్రామా! జయతీర్థ దర్శకత్వంలో జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో జంటగా నటించిన ఈ చిత్రాన్ని తిలక్ రాజ్ బల్లాల్, ముజమిల్ అహ్మద్ ఖాన్ నిర్మించారు. జైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ నటించిన పాన్ ఇండియా మూవీఇది. ‘బనారస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు తొలిసారిగా వచ్చిన జైద్ ఖాన్ బాగా నటించాడు. మొదటి సినిమానే అయిన సులువుగా నటించడం మాత్రమే కాకుండా, కీలక సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సోనాల్ మోంటెరో ఈ చిత్రం లో అందంగా ఉంది. తన పాత్రలో బాగా సరిపోయింది. అసలు సమస్య ఏమిటంటే మెయిన్ ప్లాట్‌ను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం. డైరెక్టర్ అసలు మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పై అంతగా దృష్టి పెట్టలేదు. వీటి కారణం గా లవ్ ట్రాక్ కాస్త లాగ్ అనిపిస్తుంది. సెకండాఫ్‌లోని ఇంట్రెస్టింగ్ గా సాగే సన్నివేశాల కోసం ఎదురు చూస్తాం. అయితే అసలు ట్విస్ట్ వచ్చినప్పుడు డిజప్పాయింట్ అవుతుంది. తీసుకున్న పాయింట్ కి స్క్రీన్ ప్లే కి అసలు పొంతన ఉండదు. జయతీర్థ దర్శకత్వం తక్కువ స్థాయిలో ఉంది. అతను స్క్రీన్‌ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది. భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే అతని ఆలోచన బాగానే ఉంది, కానీ అతను చాలా అంశాలను జోడించడం వల్ల సినిమా అంత క్లారిటీ గా ఉండదు. మొత్తమ్మీద బనారస్ చిత్రం సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది.

  Trending Stories

  Related Stories