More

    ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల అరెస్ట్.. ఎలా పట్టుకున్నారంటే..!

    జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడికి పాల్పడే అవకాశం ఉండగా.. అంతలోనే భద్రతా బలగాలు అప్రమత్తమై అరెస్టు చేశాయి. పలు ప్రాంతాలలో ముగ్గురు అనుమానిత వ్యక్తుల కదలికకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, వడూరు బాలా గ్రామం సమీపంలో 22 RR, సోపోర్ పోలీసులు, 179 Bn CRPF సంయుక్తంగా వల పన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు.

    తనిఖీ చేయగా.. అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు అటుగా వెళ్తున్నట్లు గుర్తించారు. వారి ప్రవర్తన సరిగా లేదని గమనించి, ఆపై వారిని ఆపమని కోరింది. అనుమానాస్పద వ్యక్తులు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని పట్టుకున్నాయి. సైనికులు పరిస్థితిని అంచనా వేసి తీవ్ర సంయమనాన్ని ప్రదర్శించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి కాల్పులు జరపలేదు.

    అరెస్టయిన ఉగ్రవాదులను తుఫైల్ అహ్మద్, ఒవైస్ అహ్మద్, షబీర్ అహ్మద్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి మూడు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 22 రౌండ్ల పిస్టల్స్, ఒక గ్రెనేడ్, రూ.79,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద బొమాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories