More

    బావిలో పడ్డ పిల్లాడిని కాపాడడానికి వెళ్లి.. అందులోనే పడిపోయిన 30 మంది..!

    మధ్యప్రదేశ్‌లోని విధిశా జిల్లాలో గురువారం బావిలో పడి ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు బావిలో పడిపోయిన బాలుడిని రక్షించడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నప్పుడు ముప్పై మంది బావిలో పడిపోయారు. బాలుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు.

    విదిష పట్టణానికి సమీపంలోని గంజ్‌బసోడలో ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. విషయం తెలిసిన గ్రామస్థులు పిల్లాడిని రక్షించేందుకు బావి వద్దకు చేరుకున్నారు. బావి గోడను అనుకుని అందరూ గుమికూడారు. వారందరి బరువుకి బావి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 30 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు బావి వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి విశ్వాస్ సారంగ్‌ను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

    రక్షించిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. “జాతీయ విపత్తు నిర్వహణ దళం మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం ఘటన స్థలంలో ఉన్నారని.. ఇన్స్పెక్టర్ జనరల్ ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను ”అని చౌహాన్ మీడియాతో అన్నారు.

    Trending Stories

    Related Stories