National

మహారాష్ట్రలో దారుణ ఘటన.. 14 సంవత్సరాల బాలికపై 29 మంది

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. థానే జిల్లాలోని డోంబివలీ ప్రాంతంలో నివసించే 14 ఏళ్ల బాలికను 29 మంది లైంగికంగా వేధించారు. కొన్ని నెలలుగా బాలికను ఆ వ్యక్తులు లైంగిక వాంఛల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. తొలుత ఆ బాలిక స్నేహితుడు ఈ ఏడాది జనవరిలో ఆమెను బలాత్కరించాడు. తాను చేసిన పనిని వీడియో కూడా తీశాడు. ఈ వీడియో అతని దగ్గర నుంచి మరో వ్యక్తికి చేరింది. ఆ వ్యక్తి బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు. వీడియోను వైరల్ చేసేస్తానని బెదిరించి ఆ బాలికను బలాత్కరించాడు. ఇలా ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఇలా ఈ ఏడాది సెప్టెంబరు వరకూ తనపై 29 మంది లైంగిక దాడి చేసినట్లు సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 29 మందిలో 26 మందిని ఇప్పటి దాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు అందిన వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఏసీపీ దత్తాత్రేయ కరాలే వెల్లడించారు. నిందితులందరూ బాధితురాలికి తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. వీళ్లందరూ కూడా వీడియోను చూపించి పలు సందర్భాల్లో బాలికపై లైంగిక దాడులు చేశారని కరాలే వివరించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. నిందితులు ఉపయోగించిన వీడియో సహా ఇతర ఆధారాలను తమ బృందం సేకరిస్తోందని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడైన బాలిక స్నేహితుడే ఈ వీడియోను మిగతా వారికి పంపాడని పోలీసులు ధృవీకరించారు. అరెస్టయిన నిందితులందరిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376 (రేప్), 376 (N), 376 (3), 376 (D) (A) మరియు POCSO చట్టంలోని సెక్షన్ 4,6 మరియు 10 కింద కేసులు నమోదు చేయబడ్డాయి. కళ్యాణ్ సెషన్స్ కోర్టు 24 మంది నిందితులకు సెప్టెంబర్ 29 వరకు పోలీసు కస్టడీ విధించింది. అదుపులోకి తీసుకున్న ఇద్దరు మైనర్లను భివండి రిమాండ్ హౌస్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ACP సోనాలి ధోలే ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడింది.

అధికారుల నివేదికల ప్రకారం అభ్యంతరకరమైన వీడియోను లీక్ చేస్తామని బెదిరించి అమ్మాయిని అనేకసార్లు ముంబైకి సమీపంలో అనేక ప్రాంతాల్లో గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణ ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక రాజకీయ పార్టీలు ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి, త్వరితగతిన వ్యవహరించాలని ట్వీట్ చేశారు.

Related Articles

Back to top button