అమెరికాలో విశాఖపట్నం యువకుడి దారుణ హత్య

0
910

ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి అమెరికాలో హత్యకు గురయ్యాడు. అమెరికాలో గురువారం రాత్రి జరిగిన ఓ దోపిడీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల శ్రీ సత్య కృష్ణ చిట్టూరి అనే యువకుడు చనిపోయాడు. సత్య కృష్ణ అలబామాలోని ఓల్డ్ బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. దోపిడీకి వచ్చిన దుండగుడి కాల్పుల్లో సత్య కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపించారు. కృష్ణ కోసం చేసిన ఫండ్ రైజింగ్ పోస్ట్‌లో ఏపీ యువకుడు నెల రోజుల క్రితమే అమెరికా వెళ్ళాడు. అతని భార్య గర్భవతి. నిందితుడి ఫొటోలను అక్కడి పోలీసు శాఖ విడుదల చేసింది. అనుమానితుడు నల్లటి చొక్కా ధరించి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాడని తెలిపారు. అలబామా సిటీ ఆఫ్ కలేరా పోలీస్ డిపార్ట్‌మెంట్, ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే తల్లాడేగా కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించమని కోరింది.

దోపిడీ దొంగల చేతిలో హతమైన సత్యకృష్ణ విశాఖకు చెందిన వాడు. సత్యకృష్ణ మృతితో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. సత్యకృష్ణ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడని.. శవపరీక్ష కోసం అతని మృతదేహాన్ని అలబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్‌కు తరలించారు. అతడు పని చేస్తున్న స్టోర్ నుండి పెద్ద మొత్తంలో దుండగుడు నగదు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. 6-అడుగుల 6-అడుగుల, 2-అంగుళాల పొడవు, సన్నని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతను నలుపు రంగు దుస్తులు, నలుపు- తెలుపు నైక్ బూట్లు, ఎయిర్ జోర్డాన్ బ్యాక్‌ప్యాక్‌ని కలిగి ఉన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా Talladega County Sheriff’s ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన 256-245-5121 నంబర్ కు కాల్ చేయండి. నిందితుడికి సంబంధించిన టిప్ ను www.talladegasheriff.orgలో లేదా తల్లాడేగా కౌంటీ షెరీఫ్ ఆఫీస్ మొబైల్ యాప్‌లో కూడా అందించవచ్చు. సెంట్రల్ అలబామా క్రైమ్ స్టాపర్స్‌కు 334-215-STOP (7867), లేదా P3-టిప్స్ యాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. నిందితుడ్ని పట్టించిన వారికి క్రైమ్ స్టాపర్స్ $1,000 బహుమతిని అందిస్తోంది.