More

  డాక్టర్‎పై అమానుష దాడి..
  బంగ్లదేశ్ అక్రమార్కుల పనే..!

  కరోనా.. అసలే మందులేని మహమ్మారి. సోకిందని గుర్తించేలోగా శరీరాన్ని ఛిద్రం చేస్తోంది. ఆలస్యం చేస్తే ఆయువు తీస్తోంది. అయినా, మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు.. డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించిపోరాడుతున్నారు. వైద్యసేవలందిస్తూ ఇప్పటికే వేల మంది వైద్యులు కరోనా బారినపడి అసువులు బాశారు. ఇలా తమ తోటి వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నా లెక్కచేయకుండా.. కరోనా పేషెంట్లకు సేవలందిస్తున్నారు డాక్టర్లు. భార్యాబిడ్డల్ని, తల్లిదండ్రులను వదిలిపెట్టి కొన్ని నెలలుగా ఆసుపత్రులకే పరిమితమై నిస్వార్థ సేవలందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మందిని కరోనా నుండి కాపాడారు. అలాంటి డాక్టర్లకు చెయ్యిత్తి మొక్కాల్సింది పోయి.. కొందరు దుర్మార్గులు వారిపైనే దాడులకు పాల్పడుతున్నారు. వారు చేస్తున్న త్యాగాన్ని మర్చిపోయి.. వైద్య సిబ్బందిపై దాడి చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి అసోంలో చోటు చేసుకుంది. హోజాయ్ జిల్లాలోని లంక ఫుల్ టోలీ మోడల్ హాస్పిటల్ లో డ్యూటీ డాక్టర్ పై కొందరు దుర్మార్గులు దాడికి పాల్పడ్డారు. ఇంతకీ ఆ డాక్టర్ చేసిన తప్పేంటో తెలుసా..? కరోనా సోకి కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేయడమే.

  హోజాయ్ జిల్లా పిపాల పుఖురి గ్రామానికి చెందిన ఉద్దీన్‌ అనే వ్యక్తికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని హోజాయ్ లోని లంక ఫుల్ టోలీ మోడల్‌ ఆస్పతిలో చేర్పించారు. అక్కడ డ్యూటీలో వున్న డాక్టర్‌ సియూజ్‌ కుమార్‌ సేనాపతి అతడికి వైద్యం అందించారు. కానీ, అప్పటికే ఆలస్యం జరిగింది. ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని అవయవాలన్నీ పూర్తిగా చెడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ బతకడం ఆసాధ్యం. అయినా, కానీ, వైద్యుడెప్పుడూ పేషెంట్ ను బతికించాలనే చూస్తాడు. డాక్టర్ సేనాపతి కూడా అదే చేశాడు. కానీ, ఆయన శ్రమ వృథా అయింది. కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతని చావుకు డాక్టరే కారణమంటూ పేషెంట్ బంధువులు డాక్టర్ పై దాడికి పాల్పడ్డారు. వాళ్లు విచక్షణారహితంగా చేసిన దాడిని చూస్తే డాక్టర్ ను చంపడానికే ప్రయత్నించినట్టు కచ్చితంగా తెలుస్తోంది.

  బంగ్లాదేశీ అక్రమ వలసదారులైన రోగి బంధువులు.. కండకావరమెక్కి డాక్టర్ ను గొడ్డును బాదినట్టు బాదారు. ఉచ్ఛ నీచాలు మరిచిన చదువులేని మతోన్మాద మూర్ఖులు దారుణంగా కొట్టారు. చివరికి పోలీసులు అడ్డుకున్నప్పటికీ వినకుండా.. డాక్టర్ ను కింద పడేసి కాళ్లతో తన్నారు. చేతికి దొరికిన వస్తువులతో చితకబాదారు. దాదాపు 30 మంది దుర్మార్గులు రాడ్లు, స్టీల్ పేట్లతో దాడి చేశారు. ఇందులో కొందరు మహిళలు కూడా వున్నారు. దుర్మార్గుల నుంచి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే.. వెంటపడి మరీ కొట్టారు. ఓ రూమ్ లోకి పరిగెత్తి దాక్కుందామని ప్రయత్నించినా.. డోర్ తెరుచుకుని వచ్చి మరీ దాడి చేశారు. అంతేకాదు, డాక్టర్ మెడలోని బంగారు గొలుసు, ఉంగరాలు, మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు.

  ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసినన డాక్టర్‌ కుమార్‌ సేనాపతి గ్రామీణ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. అయితే, ఒక్కసారిగా దాడి జరగడంతో డాక్టర్ షాక్ తిన్నారు. ఆసుపత్రి సిబ్బంది సైతం ఏం చేయాలో తెలియన పరిస్థితుల్లో ఉండిపోయారు. రోగిని విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారని.. వైద్యం అందించేలోగా అతడు ప్రాణాలు కోల్పోయాడని అన్నారు డాక్టర్ సేనాపతి. నిజానిజాలు తెలయకుండా.. తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని వాపోయారు. తన సర్వీసులో తొలిరోజే దాడి జరగడంతో డాక్టర్ సేనాపతి షాక్ తిన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సేనాపతిని వెంటనే నాగావ్‌లోని మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

  ఇక, దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. జూనియర్‌ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌ చేశారు. వైద్యులపై దాడి అనాగరిక చర్య అని.. ఫ్రంట్‌లైన్ కార్మికులపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ ఘటన దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ పై జరిగిన దాడిని అసోం డిప్యూటీ స్పీకర్ డాక్టర్ సుమల్ మోమిన్ తీవ్రంగా ఖండించారు. అటు యువ వైద్యుడిపై దాడి ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జె.ఎ.జయలాల్ ఈ దాడిపిపై ఆవేదన వ్యక్తం చేశారు. అసోం చాప్టర్‌ ఆఫ్‌ అసోం మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  డాక్టర్ పై దాడికి పాల్పడింది బంగ్లాదేశ్ అక్రమ వలస ముస్లింలేనని స్పష్టంగా తెలుస్తోంది. వారు బెంగాలీలో మాట్లాడుకోవడం వీడియోలో రికార్డయింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వీరింతా అసోంలోని హోజాయ్ జిల్లాలో తిష్టవేశారు. ప్రస్తుతం ఇలాంటి అక్రమ వలసదారులతో హోజాయ్ జిల్లా నిండిపోయింది. 1951 జనాభా లెక్కల ప్రకారం.. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఈ జిల్లాలో 10 శాతమే. కానీ, ప్రస్తుతం 54 శాతానికి చేరింది. పశ్చిమ బెంగాల్ తర్వాత, అసోంను వారు టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా దేశంలోకి అక్రమంగా వలస రావడమే కాకుండా.. వారి సంతతిని పెంచుకుంటూ మనపైనే దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలికాలంలో చాలా పెరిగిపోయాయి.

  ఇటీవలే బెంగళూరులో ఐదుగురు బంగ్లాదేశ్ ముస్లింలు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ ఘటన మరవకముందే, అసోంలో వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఇక, పశ్చిమ బెంగాల్ లో అయితే వారి అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమార్కులకు భయపడి హిందువులు సొంతూళ్లను వదిలిపోతున్న ఘటనలు అక్కడ నిత్య కృత్యంగా మారాయి. అయినా, బెంగాల్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న దీదీ.. ఇలాంటి ఘటనలపై చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దీదీ తీరు ఇలాగే కొనసాగితే.. పశ్చిబెంగాల్ మరో బంగ్లాదేశ్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాగే అలుసిస్తే.. అసోంను సైతం మింగేసినా ఆశ్చర్యం లేదు. అందుకే, వీలైనంత తొందరగా CAA, NRC చట్టాలు అమలు చేసి.. అక్రమ వలసదారుల భరతం పట్టాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటున్నాడు.

  https://youtube.com/watch?v=7zfFcnhSao0

  Trending Stories

  Related Stories