ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిపై స్నేహితులతో కలిసి ముస్లిం యువకుడు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులుతెలిపారు. ఈ 23 ఏళ్ళ యువతి గత నెలలో అపహరణకు గురైనట్లు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, జావేద్ అనే వ్యక్తి సోదరుడు బాధితురాలిని జూన్ 14న అపహరించాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి, ముంబై తీసుకెళ్ళాడు. జావేద్‌తో ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవారు.
బాధితురాలిని ముంబైలో ఓ గదిలో జావేద్ నిర్బంధించి, ఆమె మతాన్ని మార్చి, అనంతరం పెళ్ళి చేసుకున్నాడు. ఆమెపై జావేద్, మరో ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు అత్యాచారం చేశారు. ఈ విషయాలను బయటకు వెల్లడిస్తే చంపేస్తానని జావేద్ బెదిరించాడు. ఆమెను జూన్ 23న కల్నల్ గంజ్ రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టాడు. ఈ నేపథ్యంలో వివిధ సెక్షన్ల ప్రకారం నలుగురు నిందితులపై కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించారు. నిందితుల కోసం గాలింపు జరుగుతోంది.