More

  220 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు వచ్చేస్తున్నాయ్

  వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ పై మరోసారి రాళ్లదాడి జరిగింది. బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు దల్కోలా-టెల్టా స్టేషన్‌ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాడి సమాచారం అందుకున్న బలరాంపూర్‌ పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రైలు నంబరు 22302పై కొందరు దుండగులు రాళ్లతో దాడిచేశారని.. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయని.. రైల్వే అధికారులు తెలిపారు.

  గతేడాది డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో దాడి జరిగింది. ట్రయల్ రన్ ముగించుకుని మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు.

  మరో వైపు..

  భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని స్లీపర్ వెర్షన్‌పై పని చేస్తున్నాయి. స్లీపర్ ట్రైన్.. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లలోని చైర్ కార్ వెర్షన్ కంటే 40 కిలోమీటర్ల వేగంతో 220 kmph స్పీడ్ తో వెళ్లేలా చేయనున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. వందేభారత్ రైళ్లలో స్లీపర్ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 220 కి.మీలు అందుకుంటే మాత్రం భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లుగా అవతరించనున్నాయి. ప్రస్తుత తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 180 kmph వేగంతో వెళ్లగలదు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. చైర్ కార్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో దశలవారీగా, స్లీపర్ వెర్షన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకుని రానున్నారు. భారత రైల్వేశాఖ 400 వందేభారత్ రైళ్లకు టెండర్‌ను జారీ చేసిందని, ఈ నెలాఖరులోగా పనులకు ఆమోదం లభించనుంది. ఇందుకు సంబంధించి నాలుగు ప్రధాన దేశీయ, విదేశీ కంపెనీలు ముందుకు వచ్చాయి.

  Trending Stories

  Related Stories