National

ఆ 22 వార్డులు పవిత్ర స్థలమే.. మద్యం, మాంసం అమ్మకూడదు: యోగి సర్కార్

మథుర లోని శ్రీకృష్ణ జన్మభూమి విషయంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానంకు చుట్టుపక్కల ఉన్న 22 వార్డుల ప్రాంతం పవిత్రస్థలం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఇకపై ఆ 22 వార్డులలో ఎటువంటి మద్యం అమ్మకాలు, మాంసం అమ్మకాలు జరగకూడదని తేల్చి చెప్పింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృష్ణ జన్మస్థానాన్ని ఒక మతపరమైన పుణ్యక్షేత్రంగా ప్రకటించింది. అలాగే మాంసం మరియు మద్యం అమ్మకాలను నిషేధించింది. కృష్ణ జన్మభూమిని కేంద్రంగా ఉంచుతూ, మథుర మునిసిపాలిటీలోని 22 వార్డులతో కూడిన ప్రాంతాన్ని పవిత్ర తీర్థ ప్రదేశంగా గుర్తించామని.. మాంసం మరియు మద్యం అమ్మకాలపై పూర్తీ నిషేధం ఉంటుందని యుపి ప్రభుత్వం ప్రకటించింది.

మథురలో మాంసం విక్రయాలపై నిషేధాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 30 న ప్రకటనను జారీ చేసింది. కృష్ణ జన్మభూమి చుట్టూ ఉన్న 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇప్పుడు మతపరమైన పుణ్యక్షేత్రంగా గుర్తించి త్వరలో అమలు చేయాలని భావిస్తున్నారు.

ఇంతకు ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మథురలో మాంసాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. జిల్లా మొత్తంలో మాంసం మరియు మద్యం విక్రయించడం బ్యాన్ అయి ఉంటుందని ఊహించుకున్నారు. కానీ తాజా ప్రకటనతో, నగరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతం, అది కూడా శ్రీకృష్ణ జన్మభూమి చుట్టూ 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే మాంసం మరియు మద్యం అమ్మకంపై నిషేధం ఉంటుందని స్పష్టమైంది. భారతదేశంలోని అనేక ఇతర పవిత్ర ప్రదేశాలలో మాంసం మరియు ఆల్కహాల్ అమ్మకంపై నిషేధం ఉంది. 2017 లో, సిఎం యోగి ప్రభుత్వం బృందావన్, బర్సానాలో మాంసాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పవిత్ర దేవాలయాలైన వారణాసి, హరిద్వార్ మరియు రిషికేష్ చుట్టూ కూడా ఇలాంటి నిషేధాలు ఉన్నాయి. అమృత్ సర్ నగరంలో కూడా మాంసం మరియు మద్యం అమ్మకం, వినియోగంపై నిషేధం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × four =

Back to top button