More

    2022 లో విజృంభించిన బలూచ్ ఆర్మీ..! ఎంతమందిని హతమార్చిందో తెలుసా..?

    పాక్ లోని బలూచిస్తాన్ వేర్పాటు వాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ తమ ప్రాంత ప్రజల కోసం సాయుధ తిరుగుబాటు చేస్తోంది. ఉగ్రవాద దేశం తమ ప్రాంతంలోని సహజవనరులను దోచుకుంటోందనీ,.. తమకు ప్రత్యేకదేశం కావాలని ఉద్యమిస్తున్నారు. దీనికోసం తుపాకులు పట్టుకుని పోరాటం చేస్తున్నారు. ఏకంగా పాక్ ఆర్మీపైనే తిరగబడి దాడులు చేస్తున్నారు. 2022లో ఈ సంస్థ మరింత రెచ్చిపోయింది. తమ ప్రాంతంలో పెత్తనం చేస్తున్న వందలాది పాక్ సైన్యాన్ని దాడిచేసి చంపినట్లు వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో 2022 లో మొత్తం 213 పాకిస్తానీ సైనికులను హతమార్చినట్లు తెలిపింది. గతేడాదిలో మొత్తం 162 ప్రాణాంతక దాడులకు పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఇందులో 213 మంది సైనికులు మరణించారు. దీంతో పాటు 11 మొబైల్ టవర్లను ధ్వంసం చేసినట్లు ఈ సంస్థ తెలిపింది. ఇందులో ఏడుగురు SSG కమాండోలతో సహా 100 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురు ఆర్మీ సిబ్బందికి చెందిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు, ముప్పై తొమ్మిది ఆక్రమిత చెక్‌పోస్టులను బలూచ్ ఆర్మీ కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తన నివేదికలో వెల్లడించింది. బలూచ్ తిరుగుబాటుదారులచే 26 గ్రెనేడ్ దాడులు, ఇరవై Snyper దాడులు జరిగాయి. 13 సైనిక కాన్వాయ్‌లు, 22 సైనిక వాహనాలు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకున్నారు, 12 సైనిక మోటార్‌సైకిళ్లు, 10 సైనిక శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఇందులో 11 మందుపాతర దాడులు, నాలుగు రిమోట్ కంట్రోల్ దాడులు ఉన్నాయి.

    2022లో, బలూచ్ తిరుగుబాటుదారులు సైనిక నిర్మాణ సంస్థ ఎఫ్‌డబ్ల్యుఓపై దాడులు చేశామన్నారు. ఇందులో 13 దాడుల్లో ఐదుగురు కార్మికులు గాయపడ్డారని, 16 వాహనాలు, యంత్రాలను లక్ష్యంగా చేసుకుని నిప్పంటించామని నివేదిక పేర్కొంది. Sindh Rangersపై, Navy క్యాంపుపై, నార్కోటిక్స్‌ పై కూడా దాడులు జరిపినట్లు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీఎల్‌ఎఫ్ తిరుగుబాటుదారులు నాలుగు రాష్ట్రాల పోలింగ్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. Gwadar ఓడరేవు నుంచి సరకులతో వెళ్తున్న రెండు ట్రక్కుల కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే, FWO, సైన్యానికి వస్తువులను సరఫరా చేసే 15 ట్రక్కులు కూడా ఈ దాడి లో దెబ్బతిన్నాయి.

    పాకిస్తాన్ చైనాలు కలిసి బలూచిస్తాన్ ఫ్రావిన్స్ లో సీపీఈసీ ఎకనమిక్ కారిడార్ ను నిర్మిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో చైనా పెత్తనం రోజురోజుకీ ఎక్కువవుతూ వచ్చింది. ప్రాజెక్టుల పేరుతో బలూచ్ ప్రజల భూభాగాలను చైనా అక్రమంగా ఆక్రమించుకుంటోంది. ఇందుకు పాకిస్తాన్ సైన్యం కూడా సహకరిస్తోంది. దీంతో బలూచ్ ప్రావిన్స్ లో నివాసముండే ప్రజలు భూభాగాలు కోల్పోతున్నారు. అంతేకాదు, చైనా పాకిస్తాన్ లు కలిసి ఆ దేశంలోని సహజ వనరులను కూడా దోచుకుంటున్నాయి. బలూచిస్తాన్ లో ప్రఖ్యాత Gwadar పోర్టులో కూడా రెండు దేశాలు కలిసి భారీగా చేపల వేటను కొనసాగిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలకు ఉపాధి కరువవుతోంది. ఈ కారణాలతో బలూచిస్తాన్ ప్రజలు తమ ప్రాంతంలోని పాక్ పెత్తనంపై తిరుగుబాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది సాయుధ తిరుగుబాట్లకు పాల్పడుతున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే విధంగా సాయుధ తిరుగుబాటు చేస్తోంది.

    Trending Stories

    Related Stories