More

    హుస్సేన్ బతుక్ కు జీవిత ఖైదు

    2002లో జరిగిన గోద్రా రైలు మారణహోమంలోని కీలక నిందితుడు రఫీక్ హుస్సేన్ బతుక్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2002 ఫిబ్రవరి 27న కరసేవకులతో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న రైలును తగులబెట్టగా.. 59 మంది మంటల్లో చిక్కుకుని మరణించారు. ఈ ఘటనకు రఫీక్ హుస్సేన్ బతుక్ కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్న అల్లర్లలో 1200 మందికి పైగా మరణించారు.ఈ కేసులో ఇప్పటివరకు కోర్టు దోషిగా నిర్ధారించిన 35వ నిందితుడుగా భతుక్ నిలిచాడు. గతంలో ఈ కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక సిట్ కోర్టు మార్చి 1, 2011న తీర్పునిచ్చింది. వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది.

    spot_img

    Trending Stories

    Related Stories