తొడగొట్టాలని చూస్తే.. పిడిగుద్దులు కురిపించారు..

0
675

లిల్లీపుట్ గాళ్లు మళ్లీ గిల్లారు. బోర్డర్ దాటబోయి బొక్కబోర్లా పడ్డారు. భారత జవాన్లు పిడిగుద్దులు కురిపించడంతో.. ఛిద్రమైన ముఖాలతో పరుగు లఘించుకున్నారు. కాళ్లూ చేతులు విరగ్గొట్టుకుని కుయ్యోమొర్రో అంటూ.. వచ్చిన దారిలోనే పరుగులు పెట్టారు. సరిహద్దుల్లో ఎప్పటిలాగే, జిత్తులమారి చైనా మరోసారి తోకజాడించింది. ఏకంగా 200 మంది పీఎల్ఏ సైన్యం అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ దాటి.. భారత భూభాగంలో అడుగుపెట్టింది. అయితే, అలా అడుగుపెట్టారో లేదో.. మన వీర జవాన్లు వాళ్లను వెంటపడి మరీ తరిమికొట్టారు. దీంతో బతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించారు.

మాటిమాటికి గిల్లికజ్జాలు పెట్టుకోవడం, బోర్డర్ దాటి కవ్వించడం చైనాకు పరిపాటిగా మారిపోయింది. తన వ్యక్తిగత స్వార్థానికి తమ సైనికులను బలిపెడుతున్నాడు చైనా చీఫ్ షీ జిన్‎పింగ్. అయితే, బోర్డర్ దాటిన ప్రతిసారీ.. వాళ్లకు చుక్కలు చూపిస్తోంది భారత సైన్యం. కొన్నేళ్లుగా డ్రాగన్ సైన్యం భారత జవాన్ల చేతిలో పరువు పోగొట్టుకుంటూనేవుంది. గతేడాది తూర్పు లద్దాఖ్‎లో చైనా సైన్యం ప్రాణనష్టాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. దీనికంతటికీ మూలకారణం.. భారత సైన్యం శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనావేయడమే. భారత సైనికుల ధైర్య సాహసాల ముందు పీఎల్ఏ సైన్యం నిలబడలేదన్న సత్యాన్ని చైనా పాలకులకు ఇంకా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఉన్నది 1962 నాటి భారతదేశం కాదన్న నిజాన్ని.. ఇప్పటికే మన జవాన్లు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అయినా, చైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనేవుంది.

మైనస్ డిగ్రీల ఉష్ణగ్రతల్లోనూ మనవాళ్లు శతృవుకు చెమటలు పుట్టిస్తారు. మంచులో పోరాటం మన జవాన్లకు మరెవరూ సాటిరారు. నాటి పాలకుల చేతగానితనం వల్ల 1962 వార్‎లో వెనకడుగు వేయాల్సి వచ్చింది. లేకపోతే, భారత సైన్యం శక్తియుక్తులేంటో ఆనాడే జిత్తులమారికి తెలిసొచ్చేది. మంచు పర్వతాల్లో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భారత సైన్యాన్ని ఎదుర్కోవడం.. చైనా సైన్యం వల్ల కాదు. వాళ్లు మంచును చూస్తే వణికిపోతారు. కానీ, ప్రభుత్వ ఆదేశాలను తలవంచక తప్పదు కదా..! అందుకే, భంగపాటు తప్పదని తెలిసినా.. కవ్వింపులకు పాల్పడుతూవుంటారు. తీరా భారత సైన్యం కన్నెర్రజేసే సరికి అవమానభారంతో తోకముడుస్తూవుంటారు. చైనా – భారత్ సరిహద్దుల్లో ఇదీ వరుస. ఈసారి లద్దాక్‎ను వదిలి.. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద వాస్తవాధీన రేఖను దాటింది పీఎల్ఏ సైన్యం. అయితే, మనవాళ్లూరుకుంటారా..! 200 మందిని వెనక్కి తిరిగిచూడకుండా తరిమికొట్టారు.

చైనా ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెప్పుకుంటూ వుంటుంది. దానికి దక్షిణ టిబెట్ అని పేరు కూడా పెట్టుకుంది. అందుకే, తరుచూ అక్కడ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా LAC దగ్గరల్లోని బుమ్లా, యాంగ్సే మధ్య 200 మంది పీఎల్ఏ సైనికులు వాస్తవాధీనరేఖను దాటారు. అక్కడ ఖాళీగా వున్న మన సైనిక బంకర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ కొద్దిమంది భారత సైనికులు మాత్రమే వున్నారు. అయినా, చైనా సైనికుల దుస్సాహసాన్ని వీరోచితంగా అడ్డుకున్నారు. పదులు సంఖ్యలో వున్న మనవాళ్లు ఏకంగా 200 మందిని తరిమికొట్టారు. భారత జవాన్ల ముష్టిఘాతాలతో చైనా సైనికుల బుగ్గలు వాచిపోయాయి. కాళ్లూ, చేతులు విరిగిపోయాయి. ఊహించని ఎదురుదాడికి అవాక్కయిన పీఎల్ఏ సైన్యం.. బతుకుజీవుడా అంటూ తిరిగి తమ భూభాగంలోకి పరుగుపెట్టింది. ఇంతలో పలయానం చిత్తగిస్తున్న కొంతమందిని తవాంగ్ ప్రాంతంలో తాత్కాలికంగా నిర్బంధించింది భారత సైన్యం. ఆ తర్వాత చైనా ఆర్మీ అధికారులు వచ్చి బతిమాలాడుకోవడంతో మనవాళ్లు బందీలను విడిచిపెట్టారు. దీంతో ఏదో పొడిచేద్దామని బోర్డర్ దాటిన చైనా సైన్యం సిగ్గుతో తలవంచుకుని తిరుగు పయనం కాక తప్పలేదు.

గతంలో తూర్పు లద్ధాక్‎లోనూ ఇలాగే బరితెగించిన లిల్లీపుట్లకు.. చెంపలు వాయగొట్టి పంపించింది భారత సైన్యం. బోర్డర్ దాటాలన్న ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ఇప్పుడు ఇండో టిబెటన్ బోర్డర్‎లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోయి బొక్కాబోర్లా పడింది. ప్రతీసారి ఇలా బోర్డర్ దాటి తన్నులు తినడం వాళ్లకు అలవాటైపోయింది. బోర్డర్ దాటిన ప్రతీసారి.. గొర్రెల కాపరి గొర్రెల్ని తరిమినట్టు.. మన జవాన్లు చైనా సైన్యాన్ని తరిమికొడుతూనేవున్నారు.

నెలరోజుల కిందట ఉత్తరాఖండ్‎లోని బారాహోతి వద్ద కూడా ఇలాగే ఓ వందమంది చైనా సైనికులు బోర్డర్ దాటారు. భారత సైన్యం గమనించి తరిమికొట్టేలోపు ఓ వంతెనను కూల్చేశారు. ఇలా తరచూ భారత్‎లో చొరబడేందుకు ప్రయత్నిస్తూనేవున్నారు. ఇందుకు కోసం తమ వైపు సరిహద్దుల్లో మౌలికవసతులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కేవలం చొరబాట్ల కోసం తూర్పు లద్దాక్ సమీపంలో చైనా బోర్డర్ వైపు ఎనిమిదిచోట్ల షెల్టర్లు నిర్మించుకున్నారు. అయితే, ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నా.. బోర్డర్ దాటిన ప్రతీసారి చైనాకు మనవాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. చైనా సరిహద్దుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు భారత సైన్యం మోహరించింది వుంది. 105 ఎం.ఎం. ఫీల్డ్ గన్స్, బోఫోర్స్ రాకెట్ సిస్టమ్స్, ఎం-777 అల్ట్రా-లైట్ హొవిట్జర్ వంటి అత్యాధునిక ఆయుధాలతో అనుక్షణం పహారా కాస్తున్నారు. అటు సైన్యం ఏడాదికాలంగా ఇండో-టిబెటన్ బోర్డర్‎లో తూర్పు లద్దాక్‎లో పెద్ద సంఖ్యలో ట్యాంకులను మోహరిస్తోంది. చైనా సరిహద్దుల్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేసింది మోదీ ప్రభుత్వం. దీంతో చైనా సైనికులకు చుక్కలు కనబడుతున్నాయి.

సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన ప్రతీసారి చైనాకు భంగపాటు తప్పడం లేదు. ఎందుకంటే, భారతీయ సైనికులు దేశ భక్తితో విధులు నిర్వహిస్తారు. మిలటరీ సర్వీస్‎ను గర్వంగా భావిస్తారు. దేశ రక్షణ కోసం అవసరమైతే ప్రాణాలర్పించేందుకు కూడా సిద్ధపడతారు. అందుకే, శత్రువు నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. కానీ, చైనా పీఎల్ఏ సైన్యం అలా కాదు. అది చైనా కమ్యూనిస్టు పార్టీ యెక్క సాయుధ వ్యక్తుల ముఠా మాత్రమే. వీరిలో దేశభక్తి అన్నది ఏ కోశానా వుండదు. అందుకే, భారత సైన్యం శక్తి సామర్థ్యాలు.. చైనా కమ్యూనిస్టు పార్టీ సాయుధ ముఠాకు ఎన్నటికీ అర్థం కావు. అందుకే, ఇటీవలికాలంలో మన చేతిలో డక్కాముక్కీలు తింటోంది చైనా సైన్యం.

2018 నుంచి చైనా పీఎల్ఏ ఆన్‎లైన్ మీడియా భారత్‎కు సంబంధించిన అనేక కథనాలు, వీడియోలు విడుదల చేసింది. వాటిలో ఎంతసేపూ భారత్ దగ్గరున్న ఆయుధ సంపత్తి, విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాల గురించే వివరించింది. కానీ, ఏ వీడియోలోనూ భారత ఆర్మీ శక్తిసామర్థ్యాల గురించి చర్చించలేదు. ఎందుకంటే మన సైనికుల బలంపై వారికి కనీసం ఓ అంచనా అంటూ లేదు. లద్దాక్ ఘర్షణల సమయంలో కూడా పీఎల్ఏ మీడియా భారత సైనికశక్తిని అంచనావేయలేపోయింది. పైగా చైనా పాలకులు తమ సైన్యం శక్తి సామర్థ్యాలను చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. కానీ, వాస్తవం మాత్రం వేరుగా వుంటుంది. వన్ చైల్డ్ పాలసీ పుణ్యమా అని.. 70 శాతం చైనా సైనికులకు తోబుట్టువులు లేరు. తల్లిదండ్రులకు వారే దిక్కు. దీంతో దేశభక్తికంటే వారిలో ఫ్యామిలీ సెంటిమెంటే ఎక్కువ. అలాంటి వాళ్లు.. కేవలం చైనా కమ్యూనిస్టు పార్టీ కోసం ఎందుకు ప్రాణాలర్పిస్తారు..? అందుకే, యుద్ధరంగంలో ప్రతీసారీ సులభమైన మార్గాలనే ఎంచుకుని భంగపడతారు. శత్రు సైనికుల ముందు మోకరిల్లుతారు. ఇది చైనా సైనికుల సామర్థ్య లేమికి అద్దం పడుతోంది.

కానీ, భారత సైన్యం అలాకాదు. మన జవాన్లు దేశాన్ని కూడా కుటుంబంలానే ప్రేమిస్తారు. అధికార పార్టీ కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తారు. అదే చైనా సైన్యానికి, మన వీర జవాన్లకు ఉన్న తేడా. అందుకే, మన సైన్యం శక్తి సామర్థ్యాలను అందుకోవడం.. లిల్లీపుట్ సైన్యానికి చేతగాదు.

ప్రస్తుతం చైనా సైన్యం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చైనీయులు పీఎల్ఏలో చేరాలంటేనే వణికిపోతున్నారు. భారత సరిహద్దుల్లో డ్యూటీ అంటేనే ఏడుపు లఘించుకుంటున్న దృశ్యాలను ఇప్పటికే చూశాం. దీంతో చైనా పాలకులు తమ సైన్యం కంటే కూడా.. ప్రాణంలేని ఆయుధాలు, యంత్రాలపైనే నమ్మకం పెట్టుకున్నారు. అందువల్ల, వారికి భంగపాటు తప్పడం లేదు. దీంతో సరిహద్దు ఘర్షణల్లో ఒక్కసారైనా పైచేయి సాధించాలని చైనా ఈర్ష్యపడుతోంది. కానీ, ప్రతీసారి.. పిడిగుద్దుల వల్ల ఛిద్రమైన ముఖాలు.. కాళ్లూ చేతులు విరిగి తిరిగొస్తున్న తమ సైనికులను చూసుకుని.. సిగ్గుతో తలదించుకుంటోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here