More

    200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ

    రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వడానికే ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ఐఫోన్లను తీసుకోవడానికి స్వయంగా ఏ ఎమ్మెల్యే రాకపోగా.. ఆయన ఉద్యోగులు మాత్రం ఈ బహుమతిని తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యేలకు ఇంత ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. ఎమ్మెల్యేలందరినీ హైటెక్ చేసి పేపర్ లెస్ వైపు వెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ప్రతిదీ డిజిటల్‌గా మార్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో, రాజస్థాన్ ప్రభుత్వం తన కొత్త బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, దాని పత్రాలన్నీ బ్రీఫ్‌కేస్‌కు బదులుగా ఐఫోన్‌లో ఇవ్వబడ్డాయి. ఇవే కారణాలతో గతంలో ఎమ్మెల్యేలకు ల్యాప్‌టాప్‌లు కూడా ఇచ్చారు. గతేడాది యాపిల్ ట్యాబ్లెట్లను అందించారు. ఇప్పుడు ఐఫోన్ లు ఇచ్చారు.

    రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ బహుమతిని తిరస్కరించారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా ట్వీట్ చేస్తూ, “గులాబ్ కటారియా, రాజేంద్ర రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత, రాజస్థాన్ ప్రభుత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్‌లను తిరిగి ఇస్తామని స్పష్టం చేశారు”. ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేసిన రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

    Trending Stories

    Related Stories