మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వారు కొందరిని ప్రేరేపిస్తూ ఉన్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉగ్రవాద సంస్థ కోసం వీళ్లు పని చేస్తూ ఉన్నారని ఉగ్రవాద నిరోధక సంస్థ వీరిని అదుపులోకి తీసుకుంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముగ్గురు వ్యక్తుల ఇళ్లపై దాడి చేసి, వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. అబ్దుల్ అజీజ్, షోయబ్ ఖాన్ లను అదుపులోకి తీసుకున్నారు. వారు మధ్యప్రదేశ్‌లోని సియోని ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. గత ఏడాది కర్ణాటకలోని శివమొగలో ముగ్గురు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు బాంబు పేలుడు చేసి జాతీయ జెండాను దహనం చేసిన ఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల ఇళ్ల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్క్‌లు, అభ్యంతరకర సాహిత్యాలను ఎన్‌ఐఏ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సియోనీ సీనియర్ పోలీసు అధికారి రామ్‌జీ శ్రీవాస్తవ తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడం ఎలా అనే అంశంతో కూడిన పుస్తకాలు ఉన్నాయి.