More

    పక్షిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు..!

    ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. అది ముంబైలోని బాంద్రా – వోర్లి సీ లింక్ ర‌హ‌దారి.. కార్ల‌న్నీ వేగంగా దూసుకుపోతున్నాయి. ఓ వ్యాపార‌వేత్త కూడా త‌న కారులో వేగంగా వెళ్తున్నాడు.

    ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ ప‌క్షి ఆ బిజినెస్‌మెన్ కారు కింద ప‌డిపోయింది. దీంతో వెంటనే కారును ఆపమని డ్రైవర్‌ శ్యామ్‌ సుందర్‌ కుమార్‌కు ఆయన చెప్పాడు. దీంతో కారును డ్రైవ‌ర్ నిలిపివేశాడు. వ్యాపారవేత్త అమ‌ర్ మ‌నీష్ జ‌రివాలా. డ్రైవ‌ర్ శ్యాం సుంద‌ర్ కామ‌త్ కారు దిగి.. గాయ‌ప‌డ్డ ప‌క్షిని ప‌రిశీలిస్తున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు కింద ఒక గ్రద్ద చిక్కుకుంది.

    అనంతరం కారు దిగిన వారిద్దరూ ఆ గ్రద్దను రక్షించేందుకు ప్రయత్నించారు. మరోవైపు మరో లేన్‌లో వేగంగా వచ్చిన ఒక ట్యాక్సీ ఆ ఇద్దరినీ బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లో ఎగిరి నేలపై పడ్డారు. ఈ ప్రమాదంలో అమర్ మనీష్ జరీవాలా అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ శ్యామ్‌ సుందర్‌ కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇద్దరు వ్యక్తుల ఉసురు తీసిన ట్యాక్సీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాద సమయంలో అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

    Trending Stories

    Related Stories