National

హిందువుల వేషంలో మత కల్లోలాలకు కుట్ర..! ఇద్దరు ముస్లింలను అరెస్ట్ చేసిన పోలీసులు

దేశంలో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు సృష్టించేందుకు కొన్ని ముస్లిం సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి.

ఉగ్రదేశం పాకిస్తాన్ తో పాటు దేశంలోని కొన్ని ముస్లిం సంఘాలు నిత్యం హిందూ సమాజంపై దాడికి యత్నిస్తుంటాయి. అలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు పోలీసులు భగ్నం చేస్తూనే ఉన్నారు. భారత్ లో అల్లర్లు సృష్టించి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మొపుతున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. హిందువులను దెబ్బ తీసేందుకు ఇద్దరు ముస్లిం సోదరులు వేసిన స్కెచ్ ను యూపీ పోలీసులు భగ్నం చేశారు. హిందూ మతాన్ని దెబ్బ తీసేందుకు హిందువుల వేషంలో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడ్డారు.

దేశంలో మత ఘర్షణలు సృష్టించేందుకు ఇద్దరు ముస్లిం సోదరులు పన్నిన ఒక కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. సూఫీ సమాధులు ధ్వంసం చేయడం ద్వారా ఇరువర్గాల మధ్య ఘర్షణలు సృష్టిచేందుకు ప్రయత్నించిన ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని మహ్మద్ కమల్ అహ్మద్, మహ్మద్ అడీబ్‌‌గా గుర్తించారు. కమల్, అడీబ్‌లు హిందువుల వేషంలో కాషాయం రంగు తలకట్టు ధరించి సమాధులపై దాడులు చేశారు. షెర్‌కోట్ ప్రాంతంలో మూడు సమాధులను వీరు ఆదివారం ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే ఈ దాడులని అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సమాధుల విధ్వంసానికి సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మత గ్రంథాలను కూడా అపవిత్రం చేసినట్టు పుకార్లు వచ్చాయని, అయితే వాటిలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన వివరించారు. అరెస్టయిన ముస్లిం సోదరులను ప్రత్యేక ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వారికి ఏదైనా ఉగ్రవాద బృందాలతో సంబంధాలు ఉన్నాయా లేదా ఇంతకు ముందు ఇటువంటి దుశ్చర్యలకు ఎక్కడైనా పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది. ఇలాంటి కుట్రలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. భారత్ లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లు, ఘర్షణల వెనక ముస్లిం వర్గాల హస్తం.. ముస్లిం దేశాల ప్రమేయం చాలా సార్లు బయటపడ్డాయి. భారత్ లో మైనార్టీ వర్గంగా ఉన్న ముస్లింలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనే విష ప్రచారం విస్తృతంగా సాగుతోంది. హిందువులపై దాడులు చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా శిక్షణ సైతం ఇస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ లోనే ఇది తేటతెల్లం కావడం అందర్ని కలవరపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రవాద శిక్షణ చాపకింద నీరులాగా కొనసాగుతుంది అన్న వార్తల నేపథ్యంలో తాజాగా నిజామాబాద్లో చోటుచేసుకున్న ఘటన ఒక్కసారి రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద శిక్షణ కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లిం యువకులకు భౌతిక దాడులు చేయడానికి, మతపరమైన ఘర్షణలు సృష్టించటానికి , హింసాత్మకమైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు శిక్షణ ఇస్తున్నట్టు గుర్తించిన అబ్దుల్ ఖాదర్ అనే 52 ఏళ్ల వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తర తెలంగాణ నిజామాబాద్ లోని ఆటోనగర్ లో నివాసం ఉంటున్న ఖాదర్ వివాదాస్పదమైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ ఐ సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కరాటే శిక్షణ పేరుతో మతపరమైన దాడులకు పాల్పడేలా శిక్షణ ఇస్తున్న ఖాదర్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ట్రైనింగ్ ను భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాదు, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో మారణాయుధాలు, నిషేధిత సాహిత్యం, పిఎఫ్ఐ బ్యానర్లు, అనేక బస్సు, రైలు టికెట్లు, భారత దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సాహిత్యం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి? భౌతిక దాడులు ఎలా చేయాలి? అనేక అంశాలను నేర్పిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జిల్లాలో పిఎఫ్ఐ ఎక్కడెక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది అన్నదానిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

గతంలోనూ బోధన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగుచూశాయి . మళ్లీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద శిక్షణ కలకలం రేపింది. ఖాదర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 120A, 120B, 153A చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, 1967లోని సెక్షన్ 13 (1) (b) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఖాదర్ వద్ద ఎంతమంది శిక్షణ పొందారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం యువకులను టార్గెట్ చేసి, వారిని మతపరమైన పోరాటయోధులుగా మార్చడానికి, ఉగ్రవాదులుగా తయారు చేయడానికి ఖాదర్ పనిచేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. తెలంగాణా నుండి మాత్రమే కాకుండా ఏపీ నుండి కూడా యువకులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. నిజామాబాద్ లో రెండు వందల మందికి పైగా ఖాదర్ శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ఇక వారందరినీ గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

10 − 3 =

Back to top button