More

    భారత్ నుండి 192,000 కిలోల ఆవు పేడ కావాలంటున్న కువైట్

    బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇతర అరబ్ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, ఈ పరిస్థితులలో భారతదేశం నుండి కువైట్‌కు 192,000 కిలోల ఆవు పేడ ఎగుమతి చేయబడుతోంది. సేంద్రీయ వ్యవసాయం కోసం పేడను కువైట్‌కు పంపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 15, బుధవారం, కనకపుర రైల్వే స్టేషన్ నుండి మొదటి బ్యాచ్ పేడ కువైట్‌కు బయలుదేరింది. అలాగే కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో పేడను ప్యాకింగ్ చేసే పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. జైపూర్‌లోని ఓ గోశాల నుంచి పేడను పంపిస్తున్నారు. కువైట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీకి పేడను ఎగుమతి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా పేడ గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. పంటల ఉత్పత్తిని పెంచడంతో పాటు, ఆవు పేడను ఉపయోగించి పండించిన పంటలను తినడం వల్ల వివిధ వ్యాధుల నుండి బయటపడవచ్చని అనేక అధ్యయనాలలో తేలింది. కువైట్ లోనూ ఆవు పేడతో సేంద్రీయ వ్యవసాయంపై పరిశోధనలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కువైట్‌లో పొడి వాతావరణం, తగినంత నీరు లేకపోవడంతో వ్యవసాయం కష్టమే..! అందుకే ఆవు పేడ ఎరువులను ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయంపై కువైట్ దృష్టి సారించింది.

    spot_img

    Trending Stories

    Related Stories