భారత్ లో 17 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకున్న వాట్సాప్

0
1063

కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నిబంధనలు ఉల్లంఘించిన లక్షలాది ఖాతాలపై ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొరడా ఝుళిపించింది. 17 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. IT రూల్స్ 2021 ప్రకారం నవంబర్ నెలలో WhatsApp సంస్థ 17.59 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు కంపెనీ సమర్పించిన నివేదికలో తెలిపింది. అదే నెలలో భారతదేశం నుండి 602 ఫిర్యాదులను స్వీకరించింది. వాటిలో 36 ఫిర్యాదులపై చర్యలు తీసుకుంది. చర్య తీసుకోవడం కిందట.. ఒక ఖాతాను సస్పెండ్ చేయడం లేదా ఫిర్యాదు ఫలితంగా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం. IT రూల్స్ 2021కి అనుగుణంగా సంస్థ నవంబర్‌లో తన ఆరవ నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఆటోమేటెడ్ మెసేజ్‌లు, స్పామ్‌ని అనధికారికంగా ఉపయోగించడం వల్ల 95% కంటే ఎక్కువ అకౌంట్ల నిషేధాలు చోటు చేసుకున్నాయి కంపెనీ పేర్కొంది. వాట్సాప్ ప్రతినిధి అధికారిక ప్రకటనలో, ‘ఐటి రూల్స్ 2021 ప్రకారం, మేము నవంబర్ నెలలో మా ఆరవ నెలవారీ నివేదికను ప్రచురించాము. ఈ వినియోగదారు-భద్రతా నివేదికలో స్వీకరించబడిన వినియోగదారు ఫిర్యాదుల వివరాలు, WhatsApp ద్వారా తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే మా ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి WhatsApp సొంత నివారణ చర్యలు ఉన్నాయి. తాము నిషేధించిన ఖాతాల్లో బల్క్, స్పామ్ సందేశాలు పంపేవి ఎక్కువగా ఉన్నాయని వాట్సాప్ వెల్లడించింది.

ఇతర యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ వెల్లడించింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుండడం, అశ్లీల సమాచారం వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. సదరు ఖాతాలు తమ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు తేలిందని తెలిపింది. వాట్సాప్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యూజర్లపై నిషేధం విధించడం ఇదేమీ కొత్తకాదు. గతేడాది అక్టోబరులో 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది.

వాట్సాప్ సంస్థ తన పనిలో మరింత పారదర్శకతను నిర్ధారించడానికి, భవిష్యత్ నివేదికలలో తమ ప్రయత్నాల గురించి మరింత సమాచారాన్ని చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. నవంబర్ 2021లో వచ్చిన 602 ఫిర్యాదులలో ఖాతా మద్దతు కోసం 149, నిషేధానికి అప్పీల్ కోసం 357, ఇతర మద్దతు కోసం 21, ఉత్పత్తి మద్దతు కోసం 48 మరియు భద్రత కోసం 27 ఫిర్యాదులు అందాయని WhatsApp తెలిపింది. ఈ ఫిర్యాదుల నుంచి బ్యాన్ అప్పీల్ కేటగిరీ కింద 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =