National

తాలిబాన్లు భారతీయులను కిడ్నాప్ చేయలేదు.. అందరూ సేఫ్: భారత్ ప్రభుత్వం

తాలిబాన్లు 150 మంది భారతీయులను కిడ్నాప్ చేశారనే వార్తలు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్ లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న క్రమంలో అక్కడ చిక్కుకున్న చాలా మంది కాబూల్ విమానాశ్రయానికి వచ్చారని.. అక్కడ ఉన్న తాలిబన్లు వారిని లోపలికి అనుమతించలేదని కథనాలు వచ్చాయి. వేరే గేటు నుంచి వెళ్లాలని చెప్పి తాలిబన్లు భారతీయులను ట్రక్కులెక్కించారని, తీరా అక్కడకు తీసుకెళ్లకుండా వేరే చోటుకు తీసుకెళ్లిపోయారని కథనాలు వచ్చాయి.

కాబూల్ నుండి దాదాపు 150 మంది భారతీయ పౌరుల అపహరణకు సంబంధించిన వార్తలను తాలిబాన్ ప్రతినిధి అహ్మదుల్లా వసేక్ ఖండించారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ తాలిబాన్ బృందానికి చెందిన సభ్యులు ఉన్నారని, ప్రజలు విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి అనుమతించరని ఆయన చెప్పారు. భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, అధికారులు వారితో టచ్‌లో ఉన్నారని భారత ప్రభుత్వం తెలిపింది. విమానాశ్రయం వెలుపల చిక్కుకున్న భారతీయ పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి సహాయపడటానికి అధికారుల బృందం ఇప్పటికే కాబూల్‌లో ఉందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాబూల్ విమానాశ్రయం బయట 100-150 మంది భారతీయులను తాలిబాన్లు కిడ్నాప్ చేసినట్లు చాలా మంది ఆఫ్ఘన్ జర్నలిస్టులు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, స్థానిక జర్నలిస్టులు భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, కాబూల్ విమానాశ్రయానికి తిరిగి తరలిస్తున్నారని అన్నారు. తాలిబాన్లు భారతీయులను చెకింగ్ చేసినట్లు, పలు ప్రశ్నలు వేసినట్లు తెలిపారు.తాలిబాన్లు పాస్ పోర్టులు, ప్రయాణ పత్రాలను చెక్ చేస్తున్నారని అంటున్నారు. భారతీయుల ప్రాణాలకు ఎలాంటి హాని లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు పరోక్ష చర్చలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లోని వివిధ నగరాల్లో దాదాపు వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారందరినీ విమానాశ్రయానికి తీసుకొచ్చి భారత్ కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీలైనంత ఎక్కువ మంది భారతీయులను కాబూల్ విమానాశ్రయానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వారి తరలింపు కోసం సీ17 ఆర్మీ విమానాన్ని ఢిల్లీలో సిద్ధంగా ఉంచారు. భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ లో పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 15 =

Back to top button