వికారాబాద్ లో దారుణం.. 15 ఏళ్ల బాలికను అతి దారుణంగా హత్య

0
910

వికారాబాద్ జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం మొదలైంది. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో ఓ బాలికను యువ‌కుడు దారుణంగా హత్య చేశాడు. గ్రామ శివారుకు ఆ బాలిక‌ వెళ్లిన బాలికను ఓ యువకుడు హ్యుయా చేశాడు. బాలిక‌ను రాయితో మోది చంపేసిన అనంత‌రం నిందితుడు ఘ‌ట‌నాస్థ‌లి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన బాలిక కుటుంబ స‌భ్యులు ఆమె ప్రియుడిపై ప‌లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

15 సంవత్స రాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె ప్రియుని పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్యంపల్లి శివారులో 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు బాలికను నాని అనే వ్యక్తి కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతికి కారణం అతడేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు గురైన బాలిక పదో తరగతి చదువుతోంది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిందని…ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంతో గ్రామ శివారులో బాలిక మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని ఎస్పీ కోటి రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.