తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో జల్లికట్టులో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. పొంగల్ పండగలో భాగంగా తమిళనాడు ధర్మపురిలో జల్లికట్టు కార్యక్రమాన్ని చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టును వీక్షించేందుకు గోకుల్ అనే 14 సంవత్సరాల బాలుడు బంధువులతో కలిసి వచ్చాడు. బాలుడిని ఎద్దు పొడవడంతో అతడి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జల్లికట్టు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు. జల్లికట్టులో ఇప్పటివరకు అరవింద్ రాజ్, శివకుమార్, కలైముట్టి గణేశన్ సహా ఇద్దరు ప్రేక్షకులు కూడా చనిపోయారు. గోకుల్‌తో జల్లికట్టు మృతుల సంఖ్యల ఆరుకు చేరింది.