More

    మెక్సికోలో కుప్పకూలిన సైనిక హెలికాఫ్టర్.. డ్రంగ్ కింగ్ అరెస్టే కారణమా..?

    మెక్సికోలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో దుర్ఘటనలో 14 మంది మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని నావికాదళం తెలిపింది.

    సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ సినలోవా రాష్ట్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ప్రమాద సమయం హెలికాప్టర్‌లో 15 మంది ఉన్నారని చెప్పారు.

    మెక్సికలో డ్రగ్‌ కింగ్‌గా పేరొందిన డ్రగ్‌ ట్రాఫికర్‌ రాఫెల్‌ కారో క్వింటెరోను నేవీ అరెస్టు చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే హెలికాప్టర్‌ ప్రమాదానికి, రాఫెల్‌ అరెస్టుకు ఏమైనా సంబంధముందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని, ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 1985లో అమెరికాకు చెందిన యాంటీ నార్కోటిక్స్‌ ఏజెంట్‌ హత్య కేసులో డ్రగ్ కింగ్‌ రాఫెల్‌ను నౌకాదళం అదుపులోకి తీసుకున్నది.

    spot_img

    Trending Stories

    Related Stories