ఆర్యన్ ఖాన్ కు 14 షరతులు.. ఏది ఉల్లంఘించినా బెయిల్ రద్దు

ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. ఆర్యన్, అతని సహ నిందితులు ఆర్బాజ్ మర్చంట్, మున్మున్ ధామేచాకు బెయిల్ మంజూరు చేస్తామని బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌డబ్ల్యూ సాంబ్రే గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఆర్యన్ జైలులోనే గడపాల్సి వచ్చింది. శుక్రవారం ఐదు పేజీలతో కూడిన ఆర్డర్లను జారీ చేశారు. బెయిల్‌కు 14 షరతులను విధించారు. వీటిలో ఓ ఒక్క షరతును ఆర్యన్ ఖాన్ ఉల్లంఘించినా బెయిల్ రద్దుకు ఎన్సీబీ అధికారులు దరఖాస్తు చేయవచ్చు. బాంబే హైకోర్టు శుక్రవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ షరతులను నిర్దేశిస్తూ.. షారూఖ్ ఖాన్ కుమారుడు ఖచ్చితంగా పాటించాల్సిన 14 షరతులను విధించింది.
మూడు రోజుల విచారణ అనంతరం బాంబే హైకోర్టు ఎట్టకేలకు అక్టోబర్ 28న క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్లకు బెయిల్ మంజూరు చేసింది. గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసినట్లు జస్టిస్ నితిన్ సాంబ్రే తెలిపారు.
ఆర్యన్ బెయిల్ కు సంబంధించిన షరతులు చూస్తే.. ఆర్యన్(బెయిల్ దక్కించుకున్న వారు) రూ. లక్ష విలువైన వ్యక్తిగత బాండ్‌ను చెల్లించాలి. ట్రయల్(ఎన్డీపీఎస్) కోర్టులో పాస్‌పోర్టును సరెండర్ చేయాలి. ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు తప్పనిసరి. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల మధ్య ముంబై ఎన్సీబీ అధికారుల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా ముంబై విడిచి వెళ్లకూడదు. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా దేశం వీడకూడదని తెలిపారు దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా.. విచారణకు వెళ్లాలని సూచించారు. తోటి నిందితులను కలవకూడదు.. వారితో మాట్లాడకూడదని తెలిపారు. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. ఈ కేసుపై మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదని బెయిల్ షరతులు విధించారు.
ఆర్యన్ కు నటి జుహీచావ్లా ఆర్యన్‌కు పూచీకత్తు ఇచ్చారు. బెయిల్ లాంఛనాలను ట్రయల్ కోర్టు లో ముగించగానే షారూఖ్‌ఖాన్, న్యాయవాదులు ఆర్థర్రోడ్ జైలుకు చేరుకున్నారు. ఆర్యన్ విడుదల కోసం షారూఖ్ ఉద్వేగంగా ఎదురుచూశారు. సాయంత్రం 5.30 వరకు కూడా బెయిల్ ఆర్డర్లు జైలుకు చేరకపోవడంతో.. శుక్రవారం విడుదలవ్వలేదు ఆర్యన్. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.30 తర్వాత బెయిల్ ఆర్డ ర్లు వస్తే తర్వాతి రోజే విడుదల ఉంటుంది. దీంతో శనివారం నాడు ఆర్యన్ విడుదలవ్వనున్నాడు.