National

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. 13 మంది మావోయిస్టుల హతం

మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్‌ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండడంలో ప్రస్తుతం గడ్చిరోలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
ధనోరా తాలుకా కోట్మీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏటపల్లిలో ఏరియాలో పోలీసులు గాలింపు చర్యలు, కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఉదయం 5:30 సమయంలో కొట్మి దగ్గర మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం అందిందని డిఐజీ సందీప్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతానికి చేరుకున్న సీ-60 యూనిట్‌ పై మావోయిస్టులు దాడి చేయడం మొదలైంది. గంట పాటూ ఎన్ కౌంటర్ కొనసాగిందని సందీప్ పాటిల్ వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు అడవుల్లోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుండి ఏకే-47 రైఫిల్, 12-బోర్ రైఫిల్, 303 రైఫిల్, 8ఎంఎం రైఫిల్, కొన్ని ఎలెక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 × three =

Back to top button