More

    గత 30 సంవత్సరాలుగా కశ్మీర్ లో తెరుచుకోని చర్చ్ లో.. ఇప్పుడు ప్రార్థనలు

    శ్రీనగర్ నగరంలో 1990 ప్రారంభంలో మూసివేయబడిన 125 సంవత్సరాల పురాతన చర్చి క్రిస్మస్ సందర్భంగా పునరుద్ధరించబడింది. ప్రజల ప్రార్థనల కోసం తెరవబడింది. దశాబ్దాలుగా మూతపడిన శ్రీనగర్‌లోని సెయింట్ ల్యూక్ చర్చి పునరుద్ధరించబడింది.. అలాగే ప్రజల కోసం తెరవబడిందని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

    Christmas in Kashmir: Muslim artisans help restore Catholic church - Nikkei  Asia

    చర్చి శంకరాచార్య హిల్స్ కు పశ్చిమ వాలులో ఉంది. ఇది ఇంతకుముందు కాశ్మీర్ మిషన్ హాస్పిటల్ కు అనుబంధంగా ఉండేది. ఈ ఆసుపత్రిని ఇప్పుడు ఛాతీ వ్యాధుల ఆసుపత్రి అని పిలుస్తారు. ఇది ఒక శతాబ్దం క్రితం నెవిల్ బ్రదర్స్ అనే వ్యక్తులు, ఆసుపత్రి సిబ్బంది కోసం నిర్మించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద టూరిజం శాఖ ద్వారా చర్చి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు డిడి న్యూస్ నివేదిక పేర్కొంది. చర్చి కి సంబంధించిన గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ భద్రపరచబడింది. ఈ చర్చి ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలకు సిద్ధంగా ఉంది. దేవదార్ కలపలో శ్రీనగర్ మాస్టర్ కార్పెంటర్లు చెక్క పనిని పూర్తీ చేస్తున్నారు.

    Ahead of Christmas, Srinagar's 125-year-old church restored and opened for  public

    కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిసెంబర్ 23న ప్రజల కోసం పునరుద్ధరించబడిన చర్చిని ప్రారంభించారు. “క్రిస్మస్ సందర్భంగా, మనం యేసుక్రీస్తును స్మరించుకున్నప్పుడు, మన దృఢ సంకల్పాన్ని కూడా పునరుద్ఘాటిద్దాం. సత్యం, అహింస, సోదర భావాన్ని అనుసరించండి. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రతి వ్యక్తి నిజాయితీగా తమ వంతు పాత్రను పోషించాలని” ఆయన అన్నారు.

    Trending Stories

    Related Stories