More

    భగత్ సింగ్ క్యారెక్టర్ నాటకం కోసం రిహార్సల్స్ చేస్తూ.. ప్రాణాలొదిన పిల్లాడు

    పాఠశాలలో జరగబోయే కార్యక్రమంలో భగత్‌సింగ్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు ఆ పిల్లాడు. ఆ పాత్రలో భాగంగా ఉరిశిక్ష సీన్ ను రిహార్సల్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 12 ఏళ్ల సంజయ్ గౌడ ప్రాణాలు కోల్పోయాడు. ఎస్‌ఎల్‌వి స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న బాలుడిని స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పాత్ర చేయాలని స్కూలు యాజమాన్యం సూచించింది. ఇంట్లో పెద్దలు లేని సమయంలో నాటకం కోసం రిహార్సల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన సంజయ్ గౌడ మంగళవారం తన పాఠశాలలో కన్నడ రాజ్యోత్సవం రోజున జరగాల్సిన నాటకం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాగరాజ్, భాగ్యలక్ష్మిల కొడుకు సంజయ్ గౌడ. తల్లిదండ్రులు చిత్రదుర్గలో టీ స్టాల్ నడుపుతున్నారు. భగత్ సింగ్‌ను ఉరితీసిన భాగాన్ని రిహార్సల్ చేయాలనుకున్నాడు. తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చేసరికి లోపల నుంచి తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా సుజయ్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

    Trending Stories

    Related Stories