More

    చితికిన బతుకులు.. గోడ కూలి 12మంది మృతి

    గుజరాత్ రాష్ట్రంలోని మొర్బిలో విషాదం చోటు చేసుకొంది. ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది కార్మికులు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    మోర్బి జిల్లాలోని GIDC ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలడంతో 12 మంది కార్మికులు మరణించారని రాష్ట్ర అధికారి ఒకరు తెలిపారు. శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

    శిథిలాల కింద ఉన్న మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. బస్తాల్లో ఉప్పు నింపే సయమంలో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గోడ కూలిపోగానే 20 నుండి 30 మంది కూలీలు ఈ శిధిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుని 12 మంది మరణించగా మిగిలిన వారిని రక్షించినట్టుగా అధికారులు తెలిపారు.

    మోర్బీ జిల్లాలోని ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 12 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఒకకొక్కరికి రూ. 2 లక్షలను పీఎంఎన్ఆర్ఎప్ నుండి ఇస్తామని మోడీ ప్రకటించారు.

    Trending Stories

    Related Stories