ఢిల్లీ లోని కేంద్రీయ విద్యాలయ బాత్రూమ్ లో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.కేంద్రీయ విద్యాలయంలో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు టాయ్ లెట్ లోకి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక తన తరగతి గదికి వెలుతుండగా అనుకోకుండా 11,12వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలను ఢీ కొట్టింది. అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. అయితే.. వారు బాలికను తిడుతూ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం తలుపులు మూసివేసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక ఆరోపించింది. ఈ ఘటనను టీచర్‌కు తెలుపగా.. ఇద్దరు విద్యార్థులను బహిష్కరించినట్లు చెప్పారని, ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిపింది. ఇటీవల బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు, ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ కాపీని, ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి వివరాలను అందించాలని ఆదేశించింది.
ఈ సంఘటన జూలైలో జరిగింది, ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) దృష్టికి వచ్చిన తర్వాత బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ అంశంపై ఢిల్లీ పోలీసులకు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేసింది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో తెలియజేయాలని పాఠశాల అధికారులను కోరారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) అధికారులు ఈ సంఘటనను బాధితురాలు లేదా ఆమె తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్‌కు నివేదించలేదని, పోలీసుల విచారణ తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. తానీ విషయాన్ని టీచర్‌కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్కూలు యాజమాన్యం పేర్కొంది.