హైందవ సంస్కృతి పునాదులపై ఏర్పడిన భారతావనిలో.. హిందువులకే రక్షణ కరవైంది. హిందూ సన్యాసులు, సాధువులు, ఆలయ పూజారుల ప్రాణాలకే దిక్కులేకుండాపోయింది. తాజగా యూపీలో ఓ దారణ సంఘటన జరిగింది. పూజలు, వైదిక కర్మలు తప్ప మరేమీ తెలియన ఓ అమాయక సాధువును గుర్తుతెలియని దుండగులకు చంపేశారు. అదీ హిందువుల పవిత్ర పర్వదినమైన హోళీ పండుగ రోజే ఈ దారుణం చోటుచేసుకుంది. యూపీలోని బులంద్ షహర్ కు చెందిన ఆ సాధువును అత్యంత కిరాతంగా చంపేశారు. సాధువు సేవ చేస్తున్న దేవాలయ పరిసరాల్లోనే ఆయన భౌతిక ఖాయం లభ్యమైంది. పదునైన కత్తితో సాధువు గొంతు కోసి చంపేశారు. సాధువు హత్యపై స్థానిక గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవలే సాలెంపూర్ లోని కైలావన్ గ్రామం నుంచి వచ్చిన 50 ఏళ్ల అశోక్ కుమార్ అనే సాధువు.. షికార్ పూర్ లోని ఆంచ్రూ కాలా గ్రామంలోని.. ప్రసిద్ధ ధక్వాలే ఆలయంలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూ ఆలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించే అశోక్ కుమార్.. హోళీ పండుగ రోజున.. ఆలయ పరిసరాల్లోని ఆవాల తోటలో నిర్జీవంగా పడివున్నాడు. స్థానిక అధికారి బిజేంద్ర రస్తోగీ, పోలీస్ అధికారి సుభాష్ సింగ్.. సంఘటనా స్థలానికి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో పరిశీలించి హత్య వెనుక ఎవరున్నారో కనిపెడతామని ఎస్.ఎస్.పి. సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.
వారం కింద కూడా మరోసాధువుపై దాడి జరిగింది. ఓ నాగ సాధువుపై పోలీసులే దాడికి పాల్పడ్డారు. ఓ సాధువన్న గౌరవం కూడా లేకుండా విచక్షణారహితంగా కొట్టారు. చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో జరిగిందీ ఘటన. సాధువును చితకబాదడమే కాకుండా అతనివద్దనుంచి లక్షా 25 వేల రూపాయల నగదు, 12 వేలు విలువచేసే ఓ మొబైల్ ఫోన్ ను లాక్కున్నారు. అతనికి సంబంధించిన వంటసామాగ్రిని కూడా వదల్లేదు. తీవ్రంగా కొట్టి పోలీస్ స్టేషన్ నుంచి గెంటేశారు.
ఇక, యూపీలో జరిగిన మరో ఘటనలో ఓ సాధువు హత్యకు గురయ్యాడు. తల పగులగొట్టి దారుణంగా చంపేశారు. అత్యంత కిరాతకంగా మర్మాయవాల్ని కాల్చేశారు. ఇక, ఫిరోజాబాద్ లోనూ ఇలాంట ఘటనే చోటుచేసుకుంది. మహంత జయశ్రీ బాబా అనే సాధువును గుర్తుతెలియని దుండగులు చంపేశారు. అతని నుంచి గోశాల నిర్మాణం కోసం సేకరించిన లక్ష రూపాయలను లాక్కున్నారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక చోట ఓ సాధువో, సన్యాసో, లేక ఓ అర్చకుడో హత్యకు గురవుతూనేవున్నారు.
మతోన్మాద శక్తులు గతేడాది 11 మంది సాధువులపై దాడులు చేశారు. వీరిలో కొందరి ప్రాణాలు తీశారు. అయినా, ఎక్కడా ఒక్క వార్త రాలేదు. సెక్యులర్లమని బడాయి చెప్పే ఏ మీడియా ఛానెల్ సైతం ఈ వార్తల్ని కవర్ చేయలేదు. అదే, ఓ మైనార్టీ చనిపోతే, ఇవే కుహనా సెక్యులర్ మీడియా ఛానెళ్లు డిబేట్ల మీద డిబేట్లు నిర్వహిస్తాయి. కుహనా మేధావులంతా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. ఓ హిందువు హత్యకు గురైతే మాత్రం కనీసం ఖండించడానికి కూడా వీళ్లకు నోరు రాదు. వాటే సెక్యులరజమ్..!