ఏపీలో 10వ తరగతి ఫలితాల విడుదల వాయిదా

0
1250

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది. పరీక్ష ఫలితాలను సోమవారం నాడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఫలితాలు విడుదలవుతాయని చెప్పారు. ఫలితాల విడుదల వాయిదా పడటానికి కారణం ఏమిటనేది తెలియలేదు. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.

2021-22 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9 వ తేదీ వరకూ జరిగాయి. గతంలో పది పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. 2020 నుంచి పాతపద్ధతిలోనే విద్యార్థులకు మార్కులను కేటాయిస్తున్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ జరిగిన పరీక్షలకు 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు. పది పరీక్షల మూల్యాంకనానికి 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించారు.