More

    యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాలకు 1000 కోట్లు

    యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రటించారు. ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఈ మేరకు ఆర్థికసాయం అందించనున్నారు. తుపానుతో దెబ్బతిన్న రాష్ట్రాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటించనుంది. నేడు ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని కలైకుంద ఎయిర్ బేస్ లో భేటీ అయ్యారు. బెంగాల్ కు తుపాను సాయం కింద రూ.20 వేల కోట్లు కోరినట్టు మమత వెల్లడించారు.

    Related Stories